WTC ఫైనల్లో ఆసిస్.. భారత్ కూడా చేరాలంటే?

praveen
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో అడుగుపెట్టడమే లక్ష్యంగా ప్రస్తుతం టీమిండియా జట్టు ఆస్ట్రేలియా తో టెస్టు సిరీస్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పటిష్టమైన ఆస్ట్రేలియతో ఎంతో పట్టుదలతో ఆడుతూ రెండు మ్యాచ్లలో కూడా ఓడించింది టీం ఇండియా జట్టు. ఈ క్రమంలోనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో అడుగుపెట్టడానికి మరింత దగ్గర అయింది అని చెప్పాలి. అయితే ఇండోర్ వేదికగా జరిగిన మూడవ టెస్ట్ మ్యాచ్లో కూడా టీమిండియా విషయం సాధించింది అంటే ఎలాంటి సమీకరణాలు లేకుండానే అటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో అడుగుపెడుతుందని అందరూ భావించారు.

 కానీ మూడో టెస్ట్ మ్యాచ్లో టీమిండియా కు చుక్కెదురైంది అన్న విషయం తెలిసిందే. అప్పటికే వరుసగా రెండు మ్యాచ్లలో విజయం సాధించిన టీమిండియా మూడో మ్యాచ్లో మాత్రం అదే రీతిలో ప్రదర్శన కొనసాగించలేకపోయింది. ఇక వరుసగా రెండు మ్యాచ్ లలో ఓడిపోయి మూడో మ్యాచ్లో పుంజుకున్న  ఆస్ట్రేలియా టీమ్ ఇండియా పై ఆదిత్యం సాధించి తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది అని చెప్పాలి. ఇలా టీమ్ ఇండియా పై మూడో మ్యాచ్ లో విజయం ద్వారా ఎలాంటి సమీకరణాలు లేకుండానే అటు ఆస్ట్రేలియా జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో అడుగు పెట్టింది అని చెప్పాలి.

 ఇండోర్ టెస్ట్ లో భారత్ పై విజయం సాధించడం ద్వారా నేరుగా అర్హత సాధించింది. అయితే ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో ఉన్న భారత జట్టు కి ఇప్పుడు అసలు సవాలు మొదలైంది. చివరి టేస్ట్ మ్యాచ్లో భారత జట్టు గెలిస్తేనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు చేరుతుంది. లేకపోతే న్యూజిలాండ్తో జరిగే మ్యాచ్లో శ్రీలంక ఓడిపోవాలి లేదా మ్యాచ్ డ్రాగ ముగియాలి. అలా జరిగితేనే భారత్కు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో అడుగుపెట్టే ఛాన్స్ ఉంటుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: