భర్తను చంపిన భార్యకు.. కోర్టు ఏం శిక్ష విధించింది తెలుసా?

praveen
భార్యాభర్తల బంధం అంటే అన్యోన్యతకు కేరాఫ్ అడ్రస్ అని చెబుతూ ఉంటారు. ఒకసారి మూడుముళ్ల బంధంతో దాంపత్య బంధంలోకి అడుగు పెట్టిన తర్వాత ఒకరికి ఒకరు తోడు నీడగా ఉంటూ కడవరకు కష్టసుఖాలను పంచుకోవాలని పెద్దలు చెబుతూ ఉంటారు. కానీ నేటి రోజుల్లో మాత్రం భార్యాభర్తల బంధం లో ఇలాంటి అన్యోన్యత ఎక్కడా కనిపించడం లేదు. చిన్న చిన్న కారణాలకే కలిసిమెలిసి ఉండాల్సిన భార్యాభర్తలు.. బద్ద శత్రువులుగా మారిపోయి ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకోవడానికి కూడా వెనకాడని పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పాలి.

 కొన్ని కొన్ని ఘటనల్లో కొంతమంది క్షణికావేశంలో కట్టుకున్న వారిని దారుణంగా హతమారుస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తూ ఉంటే మరికొన్ని ఘటనల్లో పరాయి వ్యక్తుల మోజులో పడి అక్రమ సంబంధాల నేపథ్యంలో ఇక కట్టుకున్న వారిని హత్య చేస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయ్. ఏది ఏమైనా ఇలా కడవరకు తోడుంటామని ప్రమాణం చేసిన వారే కాలముడిగా మారిపోతున్న నేపథ్యంలో.. ఇక ఇలాంటి ఘటనలు ప్రతి ఒక్కరిని భయాందోళనకు గురి చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. సంగారెడ్డి జిల్లా కంది మండలంలో కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.

 చర్లగూడెంలో భర్త తెల్లాపురం దుర్గయ్యను దారుణంగా హత్య చేసింది భార్య నాగమ్మ. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని ఆధారాలను కూడా కోర్టులో సమర్పించారు. దీనిపై విచారణ జరిపిన సంగారెడ్డి జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి శశిధర్ రెడ్డి ఇటీవల తీర్పును వెలువరించారు. ఏకంగా భర్తను చంపిన నాగమ్మకు జీవిత ఖైదు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మద్యానికి బానిసై భర్త వేధింపులకు గురి చేయడంతోనే  గత ఏడాది ఏప్రిల్  21వ తేదీన నిద్రిస్తున్న భర్తను భార్య గొంతు కోసి హత్య చేసింది భార్య. నేరం రుజువు  కావడంతో ఇక జీవిత ఖైదు విధించినట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: