ఈ ఇద్దరు ట్రాన్స్ జెండర్ లు.. ఏం చేస్తున్నారో తెలుసా?

praveen
నేటి సభ్య సమాజంలో అందరూ సమానమే అని పైపైకి ఎన్ని మాటలు చెబుతున్నా.. ఇప్పటికి కూడా ట్రాన్స్ జెండర్లు వివక్షకు గురవుతున్నారు అన్న విషయం దాదాపు అందరికీ తెలుసు. ఇక వాళ్ళని సభ్య సమాజంలో మనుషుల్లా కూడా చూడటం లేదు కొంతమంది. ఇప్పటికీ చిన్న చూపు చూస్తూ కనీసం వారి దగ్గరికి వెళ్లడానికి కూడా ఇష్టపడని వారు చాలామంది కనిపిస్తున్నారు అని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఇక ఎంతోమంది ట్రాన్స్ జెండర్లు నేటి సభ్య సమాజంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూనే బ్రతుకు పోరాటాన్ని సాగిస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే.

 అయితే కాలంలో ఎంతో మంది ట్రాన్స్ జెండర్లు  ఎన్ని అవమానాలు ఎదురైనప్పటికీ కూడా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచే విధంగా ఎంతో ప్రతిభ కనబరుస్తున్నారు అని చెప్పాలి. అయితే తెలంగాణలో ఇటీవల ట్రాన్స్ జెండర్లు అరుదైన ఘనత సాధించారు. తొలి ట్రాన్స్ జెండర్ కు ఫోటోగ్రఫీ కోసం లోను మంజూరు కాగా మరో ట్రాన్స్ జెండర్ కు ఫోర్ వీలర్ కోసం డ్రైవింగ్ లైసెన్స్ జారీ అయింది. ఆషాడం ఆశ అనే ఒక ట్రాన్స్ జెండర్ మామూలు మనుషుల్లాగానే బ్రతకాలని అనుకుంది. ట్రాన్స్ జెండర్  కావడంతో దాదాపు ఎవరు పని ఇవ్వరు. దీంతో బ్రతకడానికి ఏదైనా మార్గం వెతుక్కోవాలని అనుకుంది.

 ఈ క్రమంలోనే ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్స్ స్కీం కింద 5 లక్షలు లోన్ పొందింది ఆషాడం ఆశ. దీంతో వచ్చిన రుణంతో ఫోటోషాప్ పెట్టుకుంది అని చెప్పాలి. ఇలా లోన్ మంజూరు అయినందుకు ఎంతో ఆనందంగా ఉందని.. ఇలా వివక్ష వీడి ఇక తమ కాల మీద తాము నిలబడేందుకు ప్రోత్సాహం కావాలి అంటూ కోరింది. మరో ట్రాన్స్ జెండర్ నక్క సింధు 10 ఏళ్ల నుంచి కరీంనగర్ లోనే ఉంటుంది. అయితే ఫోర్ వీలర్ డ్రైవింగ్ నేర్చుకుంది. ఇక ప్రభుత్వం డ్రైవింగ్ లైసెన్స్ కూడా జారీ చేసింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోనే డ్రైవింగ్ లైసెన్స్ పొందిన రెండో ట్రాన్స్ జెండర్ గా ఈమె రికార్డ్స్ వస్తుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: