సిక్సర్లు కొట్టడంలో.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన ఉమేష్ యాదవ్?

praveen
టైటిల్ చూడగానే షాక్ అయ్యారు కదా.. టీమిండియాలో అడపాదడప అవకాశాలు అందుకునే ఉమేష్ యాదవ్ ఏంటి.. ఇక ఎప్పుడు జట్టులో కనిపించే విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టడం ఏంటి అని ఆలోచనలో పడిపోయారు కదా.. అది కూడా సిక్సర్ల విషయంలో ఒక బౌలర్ అయిన ఉమేష్ యాదవ్ ఎలా విరాట్ కోహ్లీ రికార్డును బద్దలుకొట్టగలడు అనే అనుమానం మీ మదిలో మెదిలింది కదా.. మీ మదిలో ఎన్ని ఆలోచనలు పరిగెడుతున్న.. నిజంగానే ఉమేష్ యాదవ్ విరాట్ కోహ్లీ రికార్డును సమం చేసాడు. ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో మూడవ టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది భారత జట్టు.

 అయితే ఈ మ్యాచ్ లో సీనియర్ బౌలర్ మహమ్మద్ షమీకి విశ్రాంతి ఇవ్వడంతో ఇక అతని స్థానంలో జట్టులోకి వచ్చాడు ఉమేష్ యాదవ్. ఈ క్రమంలోనే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. అయితే బంతితో పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ బ్యాట్ తో మాత్రం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోయాడు. మూడో టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో భారత జట్టు బ్యాటింగ్ విభాగం పూర్తిగా చేతులెత్తేసింది. అయితే పదో నెంబర్ ఆటగాడిగా బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు ఉమేష్ యాదవ్. 13 బంతుల్లో రెండు సిక్సర్లు ఒక బౌండరీ సహాయంతో 17 పరుగులు చేసి వికెట్ కోల్పోయాడు.

 ఇలా బ్యాటింగ్లో ఆకట్టుకున్న ఉమేష్ యాదవ్ ఏకంగా విరాట్ కోహ్లీ సాధించిన ఒక రికార్డును బద్దలు కొట్టాడు. విరాట్ కోహ్లీ తన టెస్ట్ కెరియర్ లో ఇప్పటివరకు 24 సెక్సర్లు మాత్రమే కొట్టాడు. అయితే ఇక ఇటీవలే మూడో టెస్ట్ మ్యాచ్లో మొదటి ఇన్నింగ్స్ లో ఉమేష్ యాదవ్ రెండు సిక్సర్లు కొట్టడం ద్వారా తన  టెస్ట్ కెరీర్లో 24 సిక్సర్ల మార్కుని అందుకున్నాడు అని చెప్పాలి.  ఈ క్రమంలోనే కోహ్లీ రికార్డును సమం చేసి.. మాజీ కోచ్ రవిశాస్త్రి 22 సిక్సర్లు, మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ 22 సిక్సర్ల రికార్డులను అధిగమించాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: