ఎవరు చెప్పిన వినని రోహిత్ శర్మ.. చివరికి?

praveen
చిన్న తప్పుకైనా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అలాంటిదే టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన ఒక చిన్న తప్పు వల్ల భరత్ టీమ్ పెద్ద మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది. ఆ తప్పు ఏంటో దాని పరిణామాలు ఏంటో పూర్తిగా తెలుసుకుందాం.బోర్డర్ గవాస్కర్ ట్రిఫి ఇప్పటికే 2-0 తో ఆధిక్యంలో ఉన్న టీమ్ ఇండియా ప్రస్తుతం మూడవ టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది. ఈ టెస్ట్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ వచ్చిన ఇండియన్ టీమ్ పట్టుకోమని పది పరుగుల భాగస్వామ్యం చేయడానికి నానా తిప్పలు పడింది. దాంతో ఆసీస్ బౌలర్ల దాటికి బెంబేలెత్తి పోయి కేవలం 109 పరుగులకే అల్ అవుట్ అయ్యారు.
ఒక్క బ్యాట్సమెన్ కూడా సరిగ్గా ఆడలేక ఆసీస్ బౌలర్లకు దాసోహం అయ్యారు. ఇక అతి స్వల్ప టార్గెట్ తో బరిలోకి దిగిన ఆసీస్ టీమ్ కి మొదటి వికెట్ గా ట్రావిస్ హెడ్ 9 పరుగులకే వెనుతిరిగిన ఉస్మాన్ ఖ్వాజా, లబూషేన్ భాగస్వామ్యం చేసి ఇన్నింగ్స్ చక్కదిద్దే పనిలో పడ్డారు. అయితే లబూషేన్ సెట్ అవుతున్న టైం లో  రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ వచ్చాడు. 11 వ ఓవర్ లో డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేస్తున్న లబూషేన్ ప్రెడ్స్ కి బంతి తగిలి ఎల్బీడబ్ల్యూ గా అనిపించింది. ఒక వైపు కీపర్ భరత్, అశ్విన్ ఎల్బీడబ్ల్యూ అంటూ గట్టిగా అప్పీల్ చేసిన ఎంపైర్ నాట్ అవుట్ అన్నాడు.
రివ్యూ తీసుకొమ్మని బౌలర్, కీపర్ చెప్పిన కూడా రోహిత్ అందుకు ఒప్పుకోలేదు. దాంతో రీప్లే లో మాత్రం అది క్లియర్ అవుట్ గా కనిపించింది. ఇలా జట్టు కుదురుకుంటున్న టైం లో లబూషేన్ అవుట్ ని రోహిత్ మిస్ చేయడం తో కేవలం 2 వికెట్లు కోల్పోయి ఆసీస్ 108 పరుగులు చేసింది. ఒక వేళా లబూషేన్ ఔట్ అయ్యి ఉంటె మ్యాచ్ రూపం మారిపోయేది. రోహిత్ చేసిన తప్పు వల్ల మూడో మ్యాచ్ ఇండియా చేజారే అవకాశం లేకపోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: