ఆ విషయంలో నువ్వు సూపర్.. కె.ఎస్ భరత్ పై రోహిత్ ప్రశంసలు?

praveen
ఎన్నో రోజుల నిరీక్షణ తర్వాత తెలుగు క్రికెటర్ కె ఎస్ భరత్ అటు టీమిండియాలో చోటు సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ఇలా వచ్చిన అవకాశాన్ని కేఎస్ భరత్ ఎంత బాగా సద్వినియోగం చేసుకుంటాడు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. ఇకపోతే అటు కీపింగ్ నైపుణ్యాలతో అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్నాడు బ్యాటింగ్లో మాత్రం పరవాలేదు అనిపిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. కాగా ఇప్పటికే భారత జట్టు రెండు టెస్ట్ మ్యాచ్లో కూడా విజయం సాధించింది.

 ఇక ఇలా రెండు టెస్ట్ మ్యాచ్లలో కూడా భారత జట్టు గెలిచింది అంటే అందుకు ఇక జట్టులో ఉన్న స్పిన్నర్లే కారణం అని చెప్పాలి. తమ స్పిన్ బౌలింగ్ తో అదిరిపోయే ప్రదర్శన చేసిన బౌలర్లు అటు ప్రత్యర్థి ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లను ముప్పు తీప్పులు పెట్టాడు. అయితే ఇలా స్పిన్ బౌలర్లు అదరగొడితే వికెట్లు వెనకాల ఉండి మరొక ప్లేయర్ కూడా అందరీ దృష్టిని ఆకర్షించాడు. అతనే మన తెలుగు క్రికెటర్ శ్రీకర్ భరత్ అనే చెప్పాలి. ఇకపోతే ఆస్ట్రేలియా తో మూడో టెస్ట్ కోసం టీం ఇండియా ప్లేయర్లు సెలవులు ముగించుకొని ఇండోర్ కు చేరుకున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే శ్రీకర్ భరత్ మీడియాతో మాట్లాడుతూ.. ఇక రోహిత్ శర్మ తనపై ప్రశంసలు కురిపించిన విషయాన్ని చెప్పుకొచ్చాడు.

 డిఆర్ఎస్ విషయాల్లో తన జడ్జిమెంట్ ను రోహిత్ మెచ్చుకున్నట్లు భారత్ చెప్పుకొచ్చాడు. డిఆర్ఎస్ లను అద్భుతంగా జడ్జ్ చేస్తున్నావ్. ఇదే ఉత్సాహాన్ని కొనసాగించు అంటూ రోహిత్ తనకు మద్దతుగా నిలిచాడని తెలిపాడు కె.ఎస్ భరత్. అయితే మొదటి టెస్టులో రెండు ఇన్నింగ్స్ లో తాను బ్యాటింగ్లో పెద్దగా రాణించలేదని.. ఇక రెండవ ఇన్నింగ్ సమయంలో మాత్రం నా వద్దకు రోహిత్ వచ్చి ఆరవ స్థానంలో బ్యాటింగ్కు వెళ్లేందుకు సిద్ధంగా ఉండు అని చెప్పాడు రోహిత్.  బ్యాటింగ్లో కొన్ని సలహాలు కూడా ఇచ్చాడు. తన బ్యాటింగ్ తోనే నాట్ అవుటుగా ఉండి జట్టు గేలుపులో కీలక పాత్ర పోషించాను అంటూ కే ఎస్ భరత్ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: