దానికోసమే ఎదురుచూస్తున్న.. రిషబ్ పంత్ ఎమోషనల్ కామెంట్?

praveen
టీమిండియాలో కీలక ప్లేయర్గా కొనసాగుతూ ఉన్నాడు రిషబ్ పంత్. తన అద్భుతమైన ఆట తీరుతో తక్కువ సమయంలోనే స్టార్ ప్లేయర్గా ఎదిగాడు అన్న విషయం తెలిసిందే. ఇక మూడు ఫార్మాట్లలో కూడా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు రిషబ్ పంత్. ఇక అలాంటి రిషబ్ పంత్ ఇక ఇటీవలే రోడ్డు ప్రమాదం బారిన పడ్డాడు అన్న విషయం తెలిసిందే. గత ఏడాది డిసెంబర్ 31వ తేదీన ఉత్తరాఖండ్ వెళ్తున్న సమయంలో తెల్లవారుజామున రూర్కి సమీపంలో అతని కారు రోడ్డు పక్కన ఉన్న రైలింగ్ ను ఎంతో వేగంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో అతని కారు పూర్తిగా సంఘటన స్థలంలోనే ఖాళీ బూడిదైంది అన్న విషయం తెలిసిందే.

 అయితే ప్రమాదం జరగడానికి కొన్ని సెకండ్ల ముందు రిషబ్ పంత్ కారులోంచి బయటకు దూకడంతో చివరికి తీవ్ర గాయాలతో ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు అని చెప్పాలి. అయితే మొన్నటి వరకు అతను ముంబైలోని  కోకిల బెన్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు. అతని మోకాలికి సర్జరీ కూడా అయింది. ఇక మరికొన్ని రోజుల్లో మెడకు కూడా సర్జరీ కాబోతుంది అన్నది తెలుస్తుంది.  అయితే రోడ్డు ప్రమాదం నేపద్యంలో  అతను టీమిండియా ఆడబోయే కీలకమైన టోర్నీలకు దూరం అయ్యాడు అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే ఇక రిషబ్ స్థానాన్ని భర్తీ చేసేందుకు టీమిండియా యాజమాన్యం ఎంతో మంది యువ ఆటగాళ్ళను పరిశీలిస్తుంది. జట్టులోకేజ్ వచ్చిన ఎవరూ కూడా రిషబ్ పంతుల ఆడలేక పోతున్నారు   దీంతో పంతు ఉంటే బాగుండేది అని అభిమానులు కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నారు అని చెప్పాలి. ఇకపోతే ప్రస్తుతం గాయాల నుంచి కోలుకుంటున్న రిషబ్ పంత్ మీడియాతో మాట్లాడాడు. నేను ఇప్పుడు చాలా మెరుగ్గా ఉన్నాను. నేను క్రికెట్ ను చాలా మిస్ అవుతున్నాను. ఎందుకంటే నా జీవితం ఎప్పుడూ దానిచుట్టే తిరుగుతుంది. కానీ ఇప్పుడు నా కాళ్ళ మీద నేను నిలబడడానికి ప్రయత్నిస్తున్నాను. మైదానంలోకి దిగి నా క్రికెట్తో మళ్ళీ అందరిని సంతోష పెట్టడానికి ఆశగా ఎదురు చూస్తున్న అంటూ పంత్ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: