పాపం.. సౌత్ ఆఫ్రికాకు అదృష్టం లేనట్టుంది?

praveen
సౌత్ ఆఫ్రికా వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో భాగంగా మరోసారి ఆస్ట్రేలియా జట్టు ఛాంపియన్గా అవతరించింది అన్న విషయం తెలిసిందే. తాము చాంపియన్ టీం అని నిరూపించి  మరోసారి విశ్వవిజేతగా నిలిచి వరల్డ్ కప్ టైటిల్ ను ముద్దాడింది ఆస్ట్రేలియా జట్టు.. ఇటీవలే జరిగిన ఫైనల్ మ్యాచ్లో అటు సౌత్ ఆఫ్రికా ను చిత్తుగా ఓడించి తాము ఛాంపియన్ టీం అన్న విషయాన్ని మరోసారి నిరూపించింది అని చెప్పాలి. ఇకపోతే అతి కష్టం మీద ఫైనల్ లో అడుగుపెట్టిన సౌత్ ఆఫ్రికాకు టైటిల్ గెలవాలన్న కళ నెరవేరలేదు.

 అయితే ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు కూడా సౌత్ ఆఫ్రికా టైటిల్ నెగ్గాలని ఎంతగానో కోరుకున్నారు. ఎందుకంటే ఇప్పటికే పలుమార్లు ఆస్ట్రేలియా జట్టు వరల్డ్ కప్ గెలిచింది. దీంతో వరల్డ్ క్రికెట్లో ఛాంపియన్ జట్టుగానే కొనసాగుతోంది. అయితే అటు సౌత్ ఆఫ్రికా మాత్రం ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఫైనల్ కు కూడా చేరలేదు అని చెప్పాలి. అయితే మొదటిసారి సెమీఫైనల్ లో పటిష్టమైన ఇంగ్లాండును ఓడించి మరి ఫైనల్ లో అడుగుపెట్టింది సౌత్ ఆఫ్రికా. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా ఎప్పుడు వరల్డ్ కప్ గెలుస్తూనే ఉంటుంది. కానీ  ఈ ఒక్కసారికి మొదటిసారి ఫైనల్ అడుగుపెట్టిన సౌత్ ఆఫ్రికా టైటిల్ గెలిస్తే బాగుంటుందని కొంతమంది ఆస్ట్రేలియా అభిమానులు కూడా కోరుకున్నారు.

 వాస్తవానికి బలాబలాలు చూసుకుంటే సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా బలం ముందు ఎక్కడ సరితూగదు.  కానీ ఎక్కడో ఏదో ఒక మ్యాజిక్ జరిగి సౌతాఫ్రికా గెలిస్తే చూడాలని కోరుకున్నారు ప్రేక్షకులు అభిమానులు. కానీ తొలిసారి టీ20 ప్రపంచ కప్ ను ముద్దాడాలనుకున్న సౌత్ ఆఫ్రికా ఆశలు అడియాశలు అయ్యాయి. తొలిసారి ప్రపంచకప్ నేటి చరిత్ర సృష్టించాలనుకున్న సౌత్ ఆఫ్రికా చివరికి ఫైనల్ లో ఒత్తిడికి ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. దీంతో ఆ దేశ అభిమానులు అందరికీ కూడా మరోసారి నిరాశ మిగిలింది అన్న విషయం తెలిసిందే. ఇక ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు కూడా పాపం  సౌత్ ఆఫ్రికా కు అదృష్టం లేనట్టుంది అని అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: