ఎంత పిఎస్ఎల్ లో ఆడితే మాత్రం.. కోహ్లీ కంటే బాబర్ బెటర్ అంటావా?

praveen
బిసిసిఐ ప్రతి ఏడాది నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి అటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్వహించే పాకిస్తాన్ సూపర్ లీగ్ కి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అన్న విషయం తెలిసిందే. ఐపీఎల్ ప్రపంచవ్యాప్తంగా గ్రేటెస్ట్ లీగ్ గా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటే... అటు పాకిస్తాన్ సూపర్ లీగ్ మాత్రం ఒక సాదాసీదా లీగ్ గానే కొనసాగుతోంది. అయినప్పటికీ ఇక తాము నిర్వహించే పాకిస్తాన్ సూపర్ లీగ్ గొప్పది అంటూ ఆ దేశ క్రికెటర్లు సొంత డబ్బా కొట్టుకుంటూ ఉంటారు. అదే సమయంలో ఐపీఎల్ పై అక్కస్సును వెల్లగక్కుతూ ఉంటారు అని చెప్పాలి.

 ఐపీఎల్ లో పాల్గొన్న ఎంతోమంది విదేశీ ఆటగాళ్లు పాకిస్తాన్ సూపర్ లీగ్ లో కూడా వివిధ జట్ల తరఫున ఆడుతూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇలాంటి సమయంలో ఇక రెండు లీగ్ లను కూడా సమానంగానే చూస్తూ ఉంటారు. కానీ పాకిస్తాన్ సూపర్ లీక్ లో ఆడితే ఇక విదేశీ ఆటగాళ్లు సైతం భారత ఆటగాళ్లపై విషం కక్కేస్తారా అంటే ఇక ఇటీవల ఏకంగా ఐపీఎల్ లో స్టార్ ప్లేయర్గా గుర్తింపు సంపాదించుకున్న డేవిడ్ మిల్లర్ చేసిన వ్యాఖ్యలతో ఇది నిజమే అన్నది అర్థమవుతూ ఉంది. పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ముల్తాన్ సుల్తాన్ జట్టు తరఫున డేవిడ్ మిల్లర్ ఆడుతూ ఉన్నాడు.

 ఈ క్రమంలోనే ఇటీవలే ఒక మీడియా సమావేశంలో పాల్గొన్నాడు డేవిడ్ మిల్లర్. ఈ క్రమంలోనే బాబర్ అజాం కవర్ డ్రైవ్ విరాట్ కోహ్లీ కవర్ డ్రైవర్ కంటే బాగుంటుంది అంటూ డేవిడ్ మిల్లర్ అనడం పెద్ద చర్చకు దారి తీసింది అని చెప్పాలి.  ప్రపంచ క్రికెట్లో విరాట్ కోహ్లీ గ్రేటెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఆల్ టైం గా పిలుస్తూ ఉంటారు. ఇక నేటి తరంలో విరాట్ కోహ్లీ కంటే మెరుగైన బ్యాట్స్మెన్ ఎవరూ లేరు అని దిగ్గజాలు సైతం అభివర్ణిస్తూ ఉంటారు. అదే సమయంలో ఇక పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలో బాబర్ కూడా ఒక అద్భుతమైన బ్యాటర్ అని చెప్పాలి.  గత కొంతకాలం మంచి ప్రపంచ క్రికెట్లో విరాట్ కోహ్లీ, బాబర్ అజాన్ ను పోల్చి చూడటం కూడా చేస్తూ ఉన్నారు. ఎవరి కవర్ ట్రై బాగుంటుంది అంటే బాబర్ అజం కవర్ డ్రైవ్ బాగుంటుందని డేవిడ్ మిల్లర్ చెప్పడం కాస్త సంచలనంగా మారింది అని చెప్పాలి. దీనిపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: