న్యూజిలాండ్ బౌలర్.. అరుదైన ప్రపంచ రికార్డ్?

praveen
సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్లో ఎంతోమంది ప్లేయర్లు రికార్డులు సృష్టించడమే లక్ష్యంగా ప్రతి మ్యాచ్లో కూడా అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఉంటారు అని చెప్పాలి. ముఖ్యంగా సుదీర్ఘమైన టెస్ట్ ఫార్మాట్లో ఇటీవల కాలంలో సీనియర్ ప్లేయర్లు అందరూ కూడా అదరగొడుతూ రికార్డుల మోత మోగిస్తున్నారు. ఇక ఎవరైనా ఆటగాడు ఇలా రికార్డులు సృష్టించాడు అంటే చాలు ఇక అందుకు సంబంధించిన వార్త కాస్త క్రికెట్ ప్రేక్షకులందరికీ దృష్టిని కూడా ఆకర్షిస్తూ ఉంటుంది అని చెప్పాలి.

 అయితే ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో మేటి జట్లుగా కొనసాగుతున్న అన్ని టీంలు కూడా సుదీర్ఘమైన ఫార్మాట్లో వరుసగా టెస్ట్ మ్యాచ్ లు ఆడుతూ బిజీబిజీగా ఉన్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతూ ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ టెస్ట్ సిరీస్ ఇక ఎన్నో ప్రపంచం రికార్డులకు వేదికగా మారిపోయింది. ఎందుకంటే ఇరు జట్ల ఆటగాళ్లు కూడా అద్భుతంగా రాణిస్తూ ఇక అరుదైన రికార్డులు సృష్టిస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇకపోతే ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టులో సీనియర్గా కొనసాగుతున్న టిమ్ సౌదీ ఒక అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఇక అతను సాధించిన రికార్డులతో అభిమానులు అందరూ కూడా ఆనందంలో మునిగిపోయారు అని చెప్పాలి.

 అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో కలిపి 700 వికెట్లు పడగొట్టిన బౌలర్ల క్లబ్లో చేరిపోయాడు న్యూజిలాండ్ సీనియర్ బౌలర్ టిమ్ సౌదీ. ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో ఈ ఘనత సాధించాడు అని చెప్పాలి. న్యూజిలాండ్ తరఫున స్పిన్నర్ డేనియల్ వెటోరి తర్వాత ఇలా 700 వికెట్ల క్లబ్లో చేరిన రెండవ బౌలర్ గా కూడా ఒక అరుదైన ఘనత సాధించాడు. ఇక టిమ్ సౌదీ కెరియర్ లో టెస్ట్ ఫార్మాట్లో 356 వన్డే ఫార్మట్ లో 210, టీ20 లలో 134 వికెట్లు పడగొట్టాడు అని చెప్పాలి. ఇలా 700 వికెట్ల మైలురాయిని అందుకోవడం పై ఎంతోమంది మాజీ క్రికెటర్లు కూడా స్పందిస్తూ అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు అని చెప్పాలి. ఇదిలా ఉంటే అటు ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య టెస్ట్ సిరీస్ నువ్వా నేనా అన్నట్లుగా హోరాహోరీగా జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: