లిస్టులో ఎవరున్నారో తెలీదు.. కానీ కోహ్లీ మాత్రం తోపు : గంభీర్

praveen
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇప్పటివరకు ప్రపంచ క్రికెట్లో సాధించిన రికార్డులు చూస్తే ఇంకా అతను సాధించాల్సిన రికార్డులు ఏమీ లేవేమో అని ప్రతి ఒక్కరికి అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు ప్రపంచ క్రికెట్లో లెజెండ్స్ గా కొనసాగుతున్న అందరి రికార్డులు కూడా విరాట్ కోహ్లీ బ్రేక్ చేసేసాడు అని చెప్పాలి. తన అద్భుతమైన ఆట తీరుతో ఎప్పుడు రికార్డుల వేట కొనసాగిస్తూనే ఉంటాడు. అందుకే అభిమానులు అందరూ కూడా విరాట్ కోహ్లీని ముద్దుగా రికార్డుల కింగ్ అని కూడా పిలుచుకుంటూ ఉంటారు.

 ఇకపోతే ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో కూడా మంచి ప్రదర్శన చేస్తున్నాడు. ఇకపోతే ఇక ఇటీవల మరో అరుదైన ఘనతను సాధించాడు. ఏకంగా క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టేసాడు అన్న విషయం తెలిసిందే. అత్యంత వేగంగా 25 వేల పరుగుల మార్కును అందుకున్న బౌలర్గా రికార్డు సృష్టించాడు విరాట్ కోహ్లీ. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ ఆట తీరుపై ఎంతో మంది ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు అని చెప్పాలి. కాగా ఇటీవల కోహ్లీ ప్రతిభ పై మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ స్పందించాడు.

 25 వేల పరుగులు పూర్తిచేసిన జాబితాలో ఎవరు ఉన్నారు అన్న విషయం అయితే నాకు తెలియదు. కానీ విరాట్ కోహ్లీ మాత్రం అందరికంటే ప్రత్యేకం. భారత్ లో మాత్రమే కాదు ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా లో కూడా అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. ఈ లిస్టులో ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా ఆటగాళ్లు ఎవరైనా ఉంటే కోహ్లీతో పోల్చకూడదు. ఎందుకంటే ఉపఖండ పిచ్లపై కూడా వారి ప్రదర్శనను పరిగణలోకి తీసుకోవాలి. అతను వన్డే క్రికెట్లో  మాస్టర్. టెస్ట్ లలో 27 సెంచరీలు 28 అర్థ సెంచరీలు ఉన్నాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ పిచ్ లపై కూడా శతకాలు సాధించాడు. ఒక ఆటగాడిగా ఇంకేం సాధించాలి అంటూ గౌతమ్ గంభీర్  ప్రశంసలతో విరాట్ కోహ్లీని ఆకాశానికి ఎత్తేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: