బాబర్ కు ఇంగ్లీష్ రాదు.. అందుకే.. షోయబ్ అక్తర్ షాకింగ్ కామెంట్స్?

praveen
సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా ఉన్న వ్యక్తి ఇక ఎన్నో ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా ఎలా మారవచ్చు అన్న విషయాన్ని ఇప్పటివరకు భారత క్రికెటర్లు ఎంతో మంది నిరూపించారు. ముఖ్యంగా కోహ్లీ అయితే జట్టు కెప్టెన్ గా కొనసాగుతున్నప్పుడే కాదు కెప్టెన్ గా తప్పుకున్న తర్వాత కూడా ఇంకా ఎన్నో బ్రాండ్లకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. తద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. కానీ పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ పరిస్థితి మాత్రం అలా లేదు. అంతర్జాతీయ క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా ఉన్న అతనితో వాణిజ్య ప్రకటనలు చేయించుకునేందుకు ఎవరు ఆసక్తి చూపడం లేదు.

 ఇదే విషయంపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. బాబర్ కు ఇంగ్లీషు సరిగ్గా రాదు. అందువల్లనే అతను బ్రాండ్ అంబాసిడర్ గా మారలేకపోయాడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.  పాక్ క్రికెటర్లలో ఇంగ్లీష్ బాగా మాట్లాడేది నేను షాహిద్ ఆఫ్రిథి, వసీం  అక్రమ్ మాత్రమే. అందుకే మా ముగ్గురికే అన్ని వ్యాపార వాణిజ్య ప్రకటనలు ఎప్పుడు వస్తూ ఉంటాయి అంటూ చెప్పుకొచ్చాడు. బాబర్ కి తన గురించి తన ఆట గురించి ఇంగ్లీషులో వర్ణించడం రాదు. ఒకవేళ అతను అనర్గళంగా చక్కగా ఆంగ్లం మాట్లాడగలిగితే పాకిస్తాన్లో నెంబర్ వన్ బ్రాండ్ అంబాసిడర్ అవుతాడు అంటూ అక్తర్ చెప్పుకొచ్చాడు.

 స్థానిక ఛానల్ తో మాట్లాడిన షోయబ్ అక్తర్.. ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలి. అయితే క్రికెట్లో రాణించడం ఒక ఎత్తు అయితే.. మీడియాతో మాట్లాడటం వారు అడిగిన ప్రశ్నలకు ఇంగ్లీష్ లో అనర్కలంగా సమాధానం చెప్పడం మరో ఎత్తు. ప్రస్తుతం చూడండి పాక్ జట్టులో ఎవరు కూడా పెద్దగా ఇంగ్లీష్ మాట్లాడలేరు. అవార్డు ప్రజెంటేషన్ సమయంలో కూడా ఎంతో ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఇంగ్లీషు భాష నేర్చుకోవడం ఏమైనా పెద్ద కష్టమైన పని అంటూ అక్తర్ ప్రశ్నించాడు.  ఇలా తమ దేశ క్రికెటర్లకు ఇంగ్లీష్ రాదు అని చెప్పి ఏకంగా సొంత దేశ క్రికెటర్లనే కించపరిచాడు షోయబ్ అక్తర్ అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: