ఐపీఎల్ కోసం సిద్ధంగా ఉన్నా : దీపక్ చాహర్

praveen
గత కొంతకాలం నుంచి టీమిండియాలో ఉన్న కీలక ఆటగాళ్లు వరుసగా గాయాల బారిన పడుతూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే భారత జట్టు ఆడుతున్న కీలకమైన టోర్నీలకు కూడా అందుబాటులో లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఇలా వరుసగా గాయాల బారిన పడి జట్టుకు దూరమవుతున్న ఆటగాళ్లలో దీపక్ చాహార్ కూడా ఉన్నాడు అని చెప్పాలి. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ సమయంలోనే జట్టులోకి వచ్చినట్లే వచ్చి మళ్ళీ గాయం బారినపడి దూరమైపోయాడు.

 ఇలా గత ఏడాది మొత్తం వరుసగా రెండుసార్లు గాయపడి ఇక పూర్తిగా క్రికెట్కు దూరంగానే ఉంటున్నాడు అని చెప్పాలి. అయితే గతేడాది ఐపీఎల్ సీజన్ లో కూడా చాలా భాగం మైదానానికి దూరంగానే ఉన్నాడు దీపక్ చాహార్. ఇకపోతే ఇక ఇప్పుడు మాత్రం 2023 ఐపీఎల్ లో ఆడేందుకు సిద్ధమవుతున్నాడు అని చెప్పాలి. మార్చి 31వ తేదీ నుంచి ప్రారంభం కాబోయే ఐపీఎల్ 16వ సీజన్ ఆడేందుకు ఫీట్ గా ఉన్నానని ఇటీవల చెప్పుకొచ్చాడు. గత రెండు నెలలుగా జాతీయ క్రీడ అకాడమీలో ఎంతగానో కష్టపడ్డాను. ఇక ఇప్పుడు ఫిట్నెస్ సాధించాను. ఐపీఎల్ కు సిద్ధం.. గత ఏడాది రెండు పెద్ద గాయాలు అయ్యాయి. దీంతో నెలలు తరబడి క్రికెట్కు దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది.

 ఫాస్ట్ బౌలర్లు గాయాల నుంచి కోలుకొని మళ్లీ పునరాగమనం చేయడం అనేది అంత తేలికైన విషయం కాదు అంటూ దీపక్ చాహార్ చెప్పుకొచ్చాడు. కాగా గత నెలలో రాజస్థాన్ తరపున సర్వీసెస్ పై రంజీ ట్రోఫీలో మ్యాచ్ ఆడాడు దీపక్ చాహర్. తద్వారా తన ఫిట్నెస్ను పరీక్షించుకున్నాడు అని చెప్పాలి. ఇకపోతే ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి. మరి ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో అయినా గాయం బారిన పడకుండా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటాడా లేదా చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: