నాకు బాలివుడ్ ఆఫర్ వచ్చింది : షోయబ్ అక్తర్

praveen
సాధారణంగా పాకిస్తాన్ క్రికెటర్లు సొంత డబ్బా కొట్టుకోవడంలో ఎప్పుడు ముందుంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పాకిస్తాన్ క్రికెటర్లు చేసే వ్యాఖ్యలు ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు వారు సొంత డబ్బా కొట్టుకోవడం చూస్తూ ఉంటే సొంత డబ్బా కొట్టుకోవడంలో మిమ్మల్ని మించిన వారు లేరు అని ప్రతి ఒక్కరికి అనిపిస్తూ ఉంటుంది.. అయితే ఇలా ఎప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే క్రికెటర్లలో అటు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ కూడా ఒకరు అనే విషయం తెలిసిందే.

 అప్పట్లో పాకిస్తాన్ జట్టులో ఆటగాడిగా ఉన్నప్పుడు షోయబ్ అక్తర్  తన ఫాస్ట్ బౌలింగ్ తో ఎంతో ప్రత్యర్థులను వనికించాడు  అని చెప్పాలి. అయితే అతను ఎంత గొప్ప బౌలర్ అయినప్పటికీ అతని కెరియర్ లో ఎన్నో వివాదాలు ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇక ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా షోయబ్ అక్తర్  ఇక ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉన్నాడు. ఇకపోతే ఇటీవల ఏకంగా తన కెరీర్ గురించి మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలి. అయితే షోయన్ అక్తర్ చేసిన వాక్యలతో అటు నేటిజన్స్ మాత్రం షాక్ అవుతున్నారు.

 ఒకానొక సమయంలో తనకు ఏకంగా బాలీవుడ్ నుంచి ఒక ఆఫర్ వచ్చింది అంటూ షోయబ్ అక్తర్ గొప్పలకు పోయాడు. మహేష్ భట్ దర్శకత్వం వహించిన గ్యాంగ్ స్టార్ సినిమాలోని ఒక ప్రధాన కోసం తనను సంప్రదించారు అంటూ చెప్పుకొచ్చాడు. కానీ అప్పుడు బిజీగా ఉండడం కారణంగా తాను ఆ పాత్ర చేయలేకపోయాను అంటూ షోయబ్ అక్తర్ తెలిపాడు. అయితే ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ షోయన్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు మాత్రం కేవలం సొంత డబ్బా కొట్టుకోవడమే అని అంటున్నారు కొంతమంది క్రికెట్ అభిమానులు. ఇకపోతే షోయబ్ అక్తర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న రావాల్పిండి ఎక్స్ప్రెస్ సినిమా ఆగిపోయింది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: