ఆడటం చేతకాక.. పిచ్ లపై నిందలు అవసరమా : గవాస్కర్

praveen
ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు బోర్డర్ గవాస్కర్  ట్రోఫీలో భాగంగా నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు అటు భారత పర్యటనకు వచ్చింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ఇరు జట్ల మధ్య ఇప్పటికే రెండు టెస్ట్ మ్యాచ్ లు జరిగాయి. అయితే రెండు టెస్ట్ మ్యాచ్ లలో కూడా భారత జట్టు అద్భుతమైన ప్రదర్శన చేసి పటిష్టమైన ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది. ఎక్కడ ఆస్ట్రేలియా జట్టుకు గెలిచేందుకు కూడా అవకాశం ఇవ్వలేదు అని చెప్పాలి.

 ముఖ్యంగా భారత బౌలింగ్ విభాగం వేసిన బంతులకు అటు ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ల దగ్గర సమాధానమే లేకుండా పోయింది. దీంతో ఇలా వచ్చి అలా వెళ్ళిపోతూ వరుసగా పెవిలియన్ బాట పట్టారు ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లు. అయితే ఇక ఆస్ట్రేలియా భారత్ మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కావడానికి ముందు నుంచే క్రికెట్ ఆస్ట్రేలియా మైండ్ గేమ్ ప్రారంభించింది. ఆ దేశ మాజీ ఆటగాళ్లు సైతం భారత్ లో ఉన్న పిచ్ లపై విమర్శలు గుప్పించారు అన్న విషయం తెలిసిందే. ఒకవేళ సాధారణంగా పిచ్ లను తయారు చేస్తే ఆస్ట్రేలియానే విజయం సాధిస్తుంది అంటూ విమర్శలు గుప్పించారు.

 ఇక ఇప్పుడు జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్ లలో కూడా ఆస్ట్రేలియా ఓటమికి స్పిన్ పిచ్ లే కారణం అంటూ కొంతమంది విమర్శలు చేస్తూ ఉండడం గమనార్హం. ఇదే విషయంపై భారత మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ స్పందిస్తూ కౌంటర్ ఇచ్చాడు. ఉపఖండం పిచ్ లపై స్పిన్ బౌలింగ్ ఎదుర్కోవడం బ్యాట్స్మెన్ లకు పెద్ద సవాల్ ఒక రకంగా చెప్పాలంటే బ్యాట్స్మెన్ ల ఫుడ్ వర్క్ కి ఇది ఒక పరీక్ష లాంటిది. ప్రాథమిక సూత్రాలు మరిచిపోయి పిచ్ అలా ఉంది ఇలా ఉంది అంటూ నానాయాగి చేయడం సరికాదు. దమ్ముంటే స్పిన్ బౌలింగ్ను సమర్థవంతంగా ఎదుర్కోవడం పై దృష్టి పెట్టండి.. కానీ ఇలాంటి అర్థరహిత వ్యాఖ్యలు మాత్రం చేయొద్దు అంటూ సునీల్  గవాస్కర్   వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: