ఐపీఎల్ ప్రారంభానికి ముందే.. సీఎస్కే కు షాక్?

praveen
2023 ఐపీఎల్ సీజన్ కు సంబంధించి ఇక అన్ని సన్నాహాలు పూర్తయ్యాయి. ఇక ఇటీవల ఐపీఎల్ కు సంబంధించిన షెడ్యూల్ కూడా అటు బీసీసీఐ ప్రకటించింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భారత క్రికెట్ ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపిఎల్ సీజన్ మార్చి 31వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుంది. అయితే ఇప్పటికే ఐపీఎల్ లో తాము ఎదుర్కోబోయే ప్రత్యర్ధులు ఎవరు అన్న విషయంపై క్లారిటీ రావడంతో ఇక ఆయా ప్రత్యర్థులను  ఎదుర్కొనేందుకు పదునైన వ్యూహాలను  సిద్ధం చేసుకుంటున్నాయ్ అన్ని జట్లు. ఇక టైటిల్ గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగెందుకు సిద్ధమవుతున్నాయి.

 ఇలాంటి సమయంలో ఇక కొన్ని జట్లకు మాత్రం వరుసగా ఆటగాళ్ళు గాయాలను బారిన పడుతూ జట్టుకు దూరమవుతూ ఉండడం మాత్రం ఆందోళనకరంగా మారిపోయింది అని చెప్పాలి. ప్రస్తుతం ఐపీఎల్ లో ఛాంపియన్ జట్టుగా కొనసాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ గత ఏడాది ఎంత పేలవ మైన ప్రదర్శన చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ధోని జడేజాకు కెప్టెన్సీ అప్పగించడం ఇక కెప్టెన్సీ భారాన్ని మోయలేకపోయిన జడేజా మళ్ళీ ధోనికే కెప్టెన్సీ అప్పగించడం జరిగింది. ఈ కన్ఫ్యూషన్ లోనే చెన్నై సూపర్ కింగ్స్ పేలవా ప్రదర్శన చేసింది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది మాత్రం కప్పు కొట్టడమే లక్ష్యంగా బరిలోకి దిగేందుకు సిద్ధమైంది.

 గత ఏడాది చివర్లో జరిగిన మినీ వేలంలో కూడా ఎంతో మంది కొత్త ఆటగాళ్ళను జట్టులోకి తీసుకుని ఎంతో పటిష్టంగా మారింది.. ఇలాంటి సమయంలో ఇక ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి ఊహించని షాక్ తగిలింది అని తెలుస్తుంది. చెన్నై జట్టులో కీలక బౌలర్గా కొనసాగుతున్న కైల్ జేమ్సన్ దూరం కాబోతున్నారట. వెన్ను గాయానికి సర్జరీ చేయించుకున్న జేమ్సన్ మూడు లేదా నాలుగు నెలల పాటు రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అతని స్థానంలో మరో ప్లేయర్ కోసం సీఎస్కే వేట మొదలుపెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: