1427 రోజుల తర్వాత.. ధోని అక్కడ అడుగు పెట్టబోతున్నాడు?

praveen
క్రికెట్ అభిమానులందరూ కూడా ఎప్పుడెప్పుడ అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ కు సంబంధించి ఇటీవల బీసీసీఐ షెడ్యూల్ విడుదల చేసింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భారత క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఇక ఈ ఐపిఎల్ సీజన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే మొన్నటి వరకు కరోనా వైరస్ కారణంగా కేవలం కొన్ని వేదికలపై మాత్రమే ఐపిఎల్ నిర్వహించింది బీసీసీఐ. కానీ ప్రస్తుతం కరోనా వైరస్ సమస్య పూర్తిగా తగ్గిపోయిన నేపథ్యంలో ఇక దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వేదికలపై కూడా ఇక మళ్ళీ ఐపీఎల్ నిర్వహించేందుకు సిద్ధమైంది.

 దీంతో క్రికెట్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పాలి. అయితే ఇక ఇలా కరోనా వైరస్ సమయంలో కేవలం పరిమితమైన వేదికలపైనే అటు ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించిన నేపథ్యంలో ఇక కొన్ని ప్రాంతాలలో క్రికెట్ పరీక్షకులు హోమ్ గ్రౌండ్ లో మ్యాచ్ ను చూడక ఏళ్లు గడిచిపోతున్నాయి అని చెప్పాలి.. ఇలాగే అటు చెన్నైలోనే చపాక్ స్టేడియం కూడా ప్రేక్షకులకు ఎంతో ఫేవరెట్. ముఖ్యంగా ధోని అభిమానులు అయితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చపాక్ స్టేడియంలో మ్యాచ్ ఆడుతూ ఉంటే అది చూసి పూనకాలు వచ్చినట్లుగా ఊగిపోతూ ఉంటారు.

 ఈ క్రమంలోనే ప్రస్తుతం చెన్నైలోనే ధోని అభిమానులందరికీ కూడా ఒక పండగ లాంటి వార్త చెప్పింది బీసీసీఐ. ఐపీఎల్ మ్యాచ్లు అటు చెన్నైలోనే చపాక్ స్టేడియం వేదిక కూడా జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ స్టేడియంలో ఏప్రిల్ మూడవ తేదీన చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఆడబోతుంది. ఈ క్రమంలోనే మహేంద్ర సింగ్ ధోని దాదాపు 1427 రోజుల తర్వాత చపాక్ స్టేడియంలో అడుగు పెట్టబోతున్నాడు. ఇక ఈ విషయాన్ని తెలియజేస్తూ ధోని ఫ్యాన్స్ అందరు కూడా సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెట్టేస్తున్నారు అని చెప్పాలి. అలాగే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కూడా తమ హోమ్ గ్రౌండ్ అయినా చిన్న స్వామి స్టేడియంలో దాదాపు నాలుగేళ్ల తర్వాత మ్యాచ్ ఆడబోతుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: