ఐపీఎల్ ప్రారంభానికి ముందే.. రాజస్థాన్ కు భారీ షాక్?

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం అయింది అంటే చాలు ఇక క్రికెట్ పోటీ ఎంతో ఉత్కంఠ భరితంగా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఇక అటు స్వదేశీ ప్లేయర్లతో పాటు విదేశీ ప్లేయర్లు కూడా ప్రత్యర్థులుగా మారడం కాదు ఏకంగా సహచరులుగా మారి ఒక జట్టు విజయం కోసం పోరాడుతూ ఉంటారు. అదే సమయంలో సహచరులు ప్రత్యర్ధులుగా మారి ఇక సహచరులనే దెబ్బకొట్టేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. దీంతో ఇక ఐపీఎల్ లో ప్రతి పోరు కూడా ఎంతో ఆసక్తికరంగా మారుతూ ఉంటుంది.

 ఇకపోతే 2023 ఐపీఎల్ సీజన్ కు సంబంధించి ఇటీవల బీసీసీఐ పూర్తి షెడ్యూల్ ప్రకటించింది అని చెప్పాలి. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం తగ్గిన నేపథ్యంలో దేశంలోని అన్ని వేదికలపై కూడా ఇక ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. దీంతో హోమ్ గ్రౌండ్ లో మ్యాచులను వీక్షించేందుకు అటు క్రికెట్ అభిమానులు అందరూ కూడా వేయికళ్లతో ఎదురుచూస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఐపీఎల్ షెడ్యూల్ కారణంగా ఈ సీజన్లో తాము ఎదుర్కోబోయే ప్రత్యర్ధులు ఎవరు అనే విషయంపై అన్ని జట్లకు ఒక క్లారిటీ వచ్చేసింది. ఈ క్రమంలోనే ఆయా జట్లను ఎదుర్కునేందుకు అన్ని టీంలు కూడా పదునైన వ్యూహాలను సిద్ధం చేసుకుంటూ ఉన్నాయి.

 ఇలాంటి సమయంలోనే ఐపీఎల్లో పటిష్టంగా కనిపిస్తున్న కొన్ని జట్లకు ఊహించని ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఐపీఎల్ ప్రారంభానికి ముందే రాజస్థాన్ రాయల్స్ కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టులో స్టార్ బౌలర్గా కొనసాగుతున్న ప్రసిద్ కృష్ణ చివరికి గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరం అయ్యే ప్రమాదం ఏర్పడింది. గత సెప్టెంబర్ లో అతడు గాయం బారిన పడ్డాడు. అయితే వారం క్రితమే అతనికి వెన్నుముకకు సర్జరీ అయింది అని చెప్పాలి. ఇక అతను పూర్తిగా కోలుకుని ఫిట్నెస్ సాధించడానికి ఆరు నుంచి ఎనిమిది నెలల వరకు సమయం పట్టే ఛాన్స్ ఉంది.  కాగా 2022 మెగా వేలంలో రాజస్థాన్ జట్టు అతన్ని 10 కోట్లు భారీ ధర పెట్టి కొనుగోలు చేసింది. ఇప్పుడు అతని స్థానంలో  ఎవరిని తీసుకుంటారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: