పాపం.. పొరపాటున లవ్ మేటర్ లీక్ చేసిన పృథ్వి షా?

praveen
వాలెంటైన్స్ డే వచ్చిందంటే చాలు సెలబ్రిటీలు తమ ప్రేమ వ్యవహారాలను సోషల్ మీడియాలో పెడతారేమో అని మీడియా వేయికళ్లతో ఎదురుచూస్తూ ఉంటుంది అని చెప్పాలి. ఇక ఎవరైనా పొరపాటున ఇలాంటివి పెట్టారు అంటే చాలు ఇక అది ఇంటర్నెట్ను షేర్ చేస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వాలంటైన్స్ డే రోజు అటు టీమిండియా ఆటగాడు శుభమన్ గిల్ ఇలాంటి పోస్ట్ తో అందరికీ తన లవ్ రిలేషన్షిప్ పై ఒక క్లారిటీ ఇచ్చేశాడు. ఎన్నో రోజుల నుంచి శుభమన్ గిల్ అటు సచిన్ కూతురు సారా టెండూల్కర్ తో ప్రేమలో ఉన్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

 అయితే ఈ విషయంపై సారా టెండూల్కర్ గాని గిల్ గాని స్పందించకపోవడంతో అభిమానులు ఇప్పటికీ కన్ఫ్యూజన్లోనే ఉన్నారు. కానీ ఇటీవల ఏకంగా ఒక హోటల్లో కాఫీ తాగుతూ ఆ ఫోటోని షేర్ చేశాడు. అయితే గతంలో అదే ప్లేస్ లో అదే టేబుల్ దగ్గర అదే చైర్ లో కూర్చున్న సారా టెండూల్కర్ కూడా ఇలాగే కాఫీ తాగుతూ పోజ్ ఇచ్చింది.. ఈ రెండు ఫోటోలు పోలిస్తూ సారా టెండూల్కర్ తో లవ్ మ్యాటర్ రివీల్ చేశాడంటూ అందరూ అంటున్నారు. అయితే గిల్ మాత్రమే కాదు ప్లేయర్ పృద్విషా సైతం వాలెంటెన్స్ డే రోజు పొరపాటున లవ్ మేటర్ లీక్ చేసేసాడు.

 పృద్వి షా నిధితపాడియాతో ప్రేమలో ఉన్నట్లు ఎన్నో రోజులుగా వార్తలు వచ్చాయి. అయితే వీరిద్దరూ ఒకరిని ఒకరు సోషల్ మీడియాలో ఫాలో చేసుకుని ఇక ఒకరి పోస్టులకు ఒకరు లైకులు కొట్టుకోవడమే కారణం. అయితే ఇప్పుడు వరకు ఎవరు దీనిపై క్లారిటీ ఇవ్వలేదు. కానీ వాలెంటైన్స్ డే సందర్భంగా పృథ్వి షా ఏకంగా నిధితపాడియాకు లిప్ లాక్ ఇస్తున్నట్లుగా ఒక ఫోటోని తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో పెట్టాడు. దీంతో అందరికీ పృద్వి షా లవ్ మేటర్ పై క్లారిటీ వచ్చింది.  అయితే వెంటనే ఈ పోస్టును డిలీట్ చేసిన పృథ్వి షా ఆ పోస్టు నేను పెట్టలేదు నిధితపాడియా ఎవరో తనకు తెలియదు అన్నట్లుగా బిల్డప్ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికి అందరికీ అంతా తెలిసిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: