బుమ్రా యార్కర్ ను.. అచ్చు గుద్దినట్లు దింపేశాడుగా?
ఇకపోతే ఇటీవలే ఏకంగా ఒక బౌలర్ బుమ్రా తరహా లోనే యార్కర్ సంధించి వికెట్ తీసేసాడు. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు అందరూ కూడా బుమ్రాను అచ్చుగుద్దినట్లుగా దింపేసాడే అని కామెంట్లు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇంతకీ ఏం జరిగిందంటే.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్వహించే పాకిస్తాన్ సూపర్ లీగ్ 2023 సీజన్ ప్రస్తుతం జరుగుతుంది. ఈ క్రమంలోనే మొదటి మ్యాచ్ లో భాగంగా ముల్తాన్ సుల్తాన్స్ వర్సెస్ లాహోర్ కలందర్స్ మధ్య మ్యాచ్ జరిగింది అని చెప్పాలి. అయితే చివరి నిమిషం వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్‌లో లాహోర్ కలందర్స్ జట్టు ఒక్క పరుగు తేడాతో విషయం సాధించింది అని చెప్పాలి.
మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరుగుతున్న సమయంలో ముల్తాన్ సుల్తాన్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న డేవిడ్ మిల్లర్ మూడవ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి నెమ్మదిగా క్రీజులో నిలదొక్కుతున్నాడు. ఇలాంటి సమయంలోనే 19 ఓవర్ వేసేందుకు వచ్చిన హరీష్ రావుఫ్ తొలి బంతికే అద్భుతమైన యార్కర్ తో డేవిడ్ మిల్లర్ ను బోల్తా కొట్టించాడు. అయితే హరీష్ రావుఫ్ వేసిన బంతికి అటు డేవిడ్ మిల్లర్ దగ్గర సమాధానమే లేకుండా పోయింది. దీంతో వికెట్ పడటంతో ఒక్కసారిగా తెల్ల మొఖం వేశాడు. అయితే ఈ వీడియో వైరల్ గా మారడంతో హరీష్ రౌఫ్ బుమ్రా యార్కర్‌ను అచ్చు గుద్దినట్లుగా దింపేశాడు అంటూ కామెంట్ చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్.