కోహ్లీ కెప్టెన్సీ నుంచి.. ఆ విషయం నేర్చుకున్నా : రోహిత్

praveen
విరాట్ కోహ్లీ నుంచి కెప్టెన్సీ బాధ్యతలను అందుకున్న రోహిత్ శర్మ ప్రస్తుతం సారధిగా సూపర్ సక్సెస్ అవుతున్నాడు అని చెప్పాలి. ఇప్పటికే ఐపీఎల్ లో తన కెప్టెన్సీ సామర్థ్యం ఏంటో నిరూపించిన రోహిత్ శర్మ... ఇక ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ లో కూడా తన కెప్టెన్సీ హవా నడిపిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇప్పటికే పరిమిత ఓవర్ల  ఫార్మాట్లో టీమ్ ఇండియాని నెంబర్ వన్ గా నిలిపిన రోహిత్ శర్మ ఇక ఇప్పుడు టెస్ట్ ఫార్మాట్లో కూడా టీమ్ ఇండియాకు వరుస విజయాలు అందిస్తున్నాడు.

 ఈ క్రమంలోనే రోహిత్ శర్మ కెప్టెన్సీ వ్యూహాలపై ఎంతోమంది మాజీ ఆటగాళ్లు ప్రస్తుతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవల ఆస్ట్రేలియాతో స్వదేశంలో ఆడుతున్న టెస్ట్ సిరీస్ లో భాగంగా మొదటి టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఘన విజయాన్ని సాధించింది. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ కెప్టెన్సీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ భారత జట్టుకు కెప్టెన్ గా ఉన్న సమయంలో తాను జట్టులో ఆటగాడిగా ఉన్నానని.. ఇక ఆ సమయంలో విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి కొన్ని నైపుణ్యాలను నేర్చుకున్నాను అంటూ రోహిత్ చెప్పుకొచ్చాడు.

 విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో నేను ఒకటి గమనించాను. మనకి వికెట్ రాకపోయినా పర్వాలేదు. కానీ ప్రత్యర్థి తప్పు చేసేలా ఒత్తిడి తీసుకురావాలి.. విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఉన్నప్పుడు ఇదే చేసేవాడు. ఇక అతని నుంచి ఈ విషయాన్ని నేర్చుకొని ఇప్పుడు కూడా తాను ఇలాంటి వ్యూహాన్ని అమలు చేస్తున్నాను.  ప్రత్యర్థి జట్టుపై ఎలా ఒత్తిడి తీసుకు రాగలను అన్న విషయం పైన ఎక్కువగా దృష్టి పెడతాను. ప్రతి బంతికి వికెట్ ఆశించవద్దు. బంతిని సరైన ప్రాంతాలలో వేస్తే అప్పుడు పిచ్ కూడా సహకరిస్తుంది అంటూ రోహిత్ తెలిపారు. అయితే రోహిత్ శర్మ ఇలా విరాట్ కోహ్లీ నుండి ఒక విషయాన్ని నేర్చుకున్నాను అంటూ చెప్పడంతో కోహ్లీ ఫ్యాన్స్ కూడా ఖుషి అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: