ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించిన అక్షర్ పటేల్ !

VAMSI
రెండు రోజుల నుండి నాగ్ పూర్ వేదికగా ఇండియా మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్యన మొదటి టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా నిన్న జరిగిన మొదటిరోజు ఆటలో ఇండియా ప్రయార్ది ఆస్ట్రేలియాపై పూర్తి ఆధిపత్యాన్ని చూపించింది. ఇండియా బౌలర్లు చెలరేగి కంగారూలను కేవలం 177 పరుగులకే కుప్పకూల్చారు. ఈ ఇన్నింగ్స్ లో కం బ్యాక్ స్పిన్నర్ జడేజా అయిదు వికెట్లు తీసుకుని ఆసీస్ నడ్డి విరిచాడు. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ఇండియాకు శుభారంభమే దక్కినా రాహుల్ దాన్ని ఉపయోగించుకోలేక 20 పరుగులకే అవుట్ అయ్యాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా లెక్కచేయక కెప్టెన్ రోహిత్ శర్మ (120) సెంచరీని అందుకున్నాడు.
ఇక పుజారా 7, కోహ్లీ 12, సూర్య 8 మరియు భరత్ 8 లు ఫెయిల్ అయ్యారు. ఒకవైపు ఆసీస్ డెబ్యూ స్పిన్నర్ మర్ఫీ వరుస పెట్టి వికెట్లు తీస్తున్నా జడేజా మరియు అక్షర్ పటేల్ లు సమర్థవంతంగా బౌలర్లను అడ్డుకున్నారు. ఆ దశలో జడేజా 70 పరుగులతో ఆకట్టుకోగా , అక్షర్ పటేల్ టేయిలెండర్ ల సహాయంతో ఆస్ట్రేలియా బౌలింగ్ యూనిట్ పై ఎదురుదాడి చేశాడు. అక్షర్ పటేల్ అల్ రౌండర్ గా జట్టులోకి వచ్చాడు. కానీ ఈ మ్యాచ్ కు ముందు అక్షర్ పటేల్ కన్నా కుల్దీప్ యాదవ్ ను తీసుకోవాలని అందరూ కోరుకున్నారు. కానీ జట్టు యాజమాన్యం మాత్రం అక్షర్ పటేల్ మీద నమ్మకంతో తీసుకున్నారు.
అయితే స్పిన్ కు బాగా అనుకూలించే పిచ్  మీద 10 ఓవర్లు బౌలింగ్ వేసినా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. కానీ బ్యాటింగ్ లో మాత్రం అదరగొట్టాడు. అక్షర్ పటేల్ మొత్తం 110 బంతులను ఎదుర్కొని 10 ఫోర్లు మరియు 1 సిక్స్ సహాయంతో 84 పరుగులు చేసి కమిన్స్ బౌలింగ్ లో అవుట్ అయ్యి చివరి వికెట్ గా వెనుతిరిగాడు. దీనితో ఇండియా ఇన్నింగ్స్ ముగిసింది... ప్రస్తుతం ఇండియా 223 పరుగుల ఆధిక్యాన్ని ఆస్ట్రేలియా ముందు ఉంచింది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: