లెఫ్ట్ కాదు గురు.. వార్నర్ రైట్ హ్యాండ్ బ్యాటింగ్?

praveen
అందరూ ఎదురు చూస్తున్న బోర్డర్ గవాస్కర్  ట్రోఫీ నేటి నుంచి ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఎలాంటి వార్మప్ మ్యాచ్ లేకుండానే బరిలోకి దిగేందుకు సిద్ధమైన రెండు జట్లు కూడా నిన్నటి వరకు ప్రాక్టీస్ లో మునిగి తేలాయి అని చెప్పాలి. అయితే భారత్లో ఉండే స్పిన్ పిచ్ లను అటు ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఎలా ఎదుర్కోబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే నాగపూర్ వేదికగా ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే.

 ఈ టెస్ట్ మ్యాచ్ డేవిడ్ వార్నర్ కు ఒక సవాలుగా మారిపోతుంది అని చెప్పాలి.  సాధారణంగా అయితే ఆస్ట్రేలియా స్టార్ ఓపెన్ డేవిడ్ వార్నర్ అటు ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తూ అదరగొడుతూ ఉంటాడు. తన బ్యాటింగ్లో  విధ్వంసం సృష్టిస్తూ ఉంటాడు అని చెప్పాలి. కానీ అలాంటి డేవిడ్ వార్నర్ కు అటు టీమ్ ఇండియాలో మాత్రం పేలవ  రికార్డులే ఉన్నాయి. ఇప్పటివరకు డేవిడ్ వార్నర్ 8 టెస్ట్ మ్యాచ్లు ఆడి 24.25 సగటుతో  మూడు అర్థ సెంచరీల సహాయంతో 388 పరుగులు మాత్రమే చేశాడు. టీమిండియా పై డేవిడ్ వార్నర్ యావరేజ్ కూడా చాలా తక్కువగా ఉంది అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే డేవిడ్ వార్నర్ ఎలా రాణించబోతున్నాడు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. అయితే సాధారణంగా నాగ్ పూర్ పిచ్ ఎడమ చేతివాటం బ్యాట్స్మెన్ లకు కష్టంగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో డేవిడ్ వార్నర్ బిబిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నాడు.  మామూలుగా అయితే వార్నర్ ఎడమ చేతి వాటం బ్యాట్స్మెన్ అని అందరికీ తెలుసు. కానీ ఇటీవల నెట్స్ లో కుడి చేతితో ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. దీంతో ఇక మొదటి టెస్ట్ మ్యాచ్లో వార్నర్ కుడి చేతితో బ్యాటింగ్ చేస్తాడా లేకపోతే ఎప్పటిలాగానే ఎడమ చేతి వాటం తో బ్యాటింగ్ కి దిగుతాడ అన్నది ఆసక్తికరంగా మారింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: