ఇంకో వరల్డ్ కప్ ఆడటంపై.. మెస్సి ఏమన్నాడో తెలుసా?

praveen
గత ఏడాది ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్ కప్ లో భాగంగా అర్జెంటీనా జట్టు విశ్వవిజేతగా నిలిచింది అన్న విషయం తెలిసిందే. తన కెప్టెన్సీలో ఒక్కసారైనా తన జట్టుకు వరల్డ్ కప్ అందించాలనే కలను.. గత ఏడాది సహకారం చేసుకున్నాడు అర్జెంటినా కెప్టెన్ మెస్సి. అయితే  మెస్సి ఖతార్లో ఫిఫా వరల్డ్ కప్ ఆడుతున్న సమయంలో ఇక అతని వయస్సు రిత్యా ఇదే చివరి వరల్డ్ కప్ అని అందుకే తప్పక అర్జెంటీనా టైటిల్ గెలవాలని ఎంతోమంది కోరుకున్నారు. ఇక అనుకున్నట్లుగానే అటు అర్జెంటుగా విజయం సాధించింది అని చెప్పాలి.

 ఇలాంటి సమయంలో ప్రస్తుతం అభిమానుల ముందు ఒక ఆసక్తికర ప్రశ్న ఉంది. ప్రస్తుతం అటు వివిధ లీగ్ లలో ఆడుతున్న లియోనాల్ మెస్సి 2026 లో జరగబోయే ఫిఫా వరల్డ్ కప్ లో ఆడతాడా లేదా అన్న చర్చ సోషల్ మీడియాలో జరుగుతూనే ఉంది అని చెప్పాలి. అయితే ఇలాంటి సమయంలోనే అభిమానులు అందరినీ కూడా నిరాశపరిచే వార్త చెప్పాడు లియోనాల్ మెస్సి. 2026 వరల్డ్ కప్ లో ఆడటంపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. నాకు ఫుట్బాల్ ఆడటం అంటే ఎంతో ఇష్టం. ఇప్పుడు నా శరీరం సహకరిస్తుంది కాబట్టి ఆటను ఎంతగానో ఆస్వాదిస్తున్నాను.

 కానీ 2026లో వరల్డ్ కప్ ఆడటం మాత్రం నా వయసు రిత్యా నాకు చాలా కష్టమే అంటూ మెస్సి చెప్పుకొచ్చాడు. కాగా ప్రస్తుతం మెస్సి వయసు 35 ఏళ్ళు కావడం గమనార్హం. 2026 ఫిఫా వరల్డ్ కప్ వచ్చే సమయానికి అతనికి 38 ఏళ్లు వస్తాయి. ఈ నేపథ్యంలోనే గత ఏడాది ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు నుంచే మెస్సికి ఇదే చివరి వరల్డ్ కప్ అన్న ప్రచారం జరిగింది. ఇక ఇటీవలే ఇదే విషయంపై స్వయంగా మెస్సి స్పందిస్తూ క్లారిటీ ఇచ్చాడు అని చెప్పాలి. కాగా మెస్సి చేసిన వ్యాఖ్యలతో వచ్చే వరల్డ్ కప్ లో తమ అభిమాన ఆటగాడు ఆడతాడు అన్న ఆశ చివరికి అభిమానులకు గల్లంతయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: