వసీం జాఫర్ చెప్పిందే జరిగింది.. అతన్ని పక్కన పెట్టిన రోహిత్?

praveen
ఇటీవల కాలంలో టీమిండియా ఏదైనా మ్యాచ్ ఆడుతుంది అంటే చాలు ఎంతో మంది మాజీ ఆటగాళ్ళు ఆ మ్యాచ్లో తుది జట్టులో ఎవరు ఉంటారు అనే విషయంపై ఒక అంచనా వేస్తూ ఉన్నారు. అదే సమయంలో ఎవరు మంచి ప్రదర్శన చేస్తారు అనే విషయంపై కూడా రివ్యూలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు అని చెప్పాలి. ఇక ఇలా కొన్ని కొన్ని సార్లు మాజీ ఆటగాళ్లు రివ్యూలు నిజమే అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు మాత్రం మాజీ ఆటగాళ్లు చెప్పింది ఒకటైతే జరిగేది మరొకటి అన్న విధంగా ఉంటుంది.

 ఈ క్రమంలోనే ఇలా టీమిండియా ఆట తీరుపై రివ్యూలు ఇవ్వడంలో మాజీ ప్లేయర్ వసీం జాఫర్ ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు అని చెప్పాలి. ఇక ఇటీవల టీం ఇండియా రెండో వన్డే మ్యాచ్ ఆడటానికి ముందు కూడా ఇలాంటి ఒక రివ్యూ ఇచ్చాడు. ఈ క్రమంలోనే మొదటి వన్డే మ్యాచ్లో జట్టులో చోటు కోల్పోయిన ఉమ్రాన్ మాలిక్ కు రెండో వన్డే మ్యాచ్లో కూడా చోటు దక్కడం కష్టమే అంటూ అంచనా వేశాడు వసీం జాఫర్. అయితే ఇటీవల కాలంలో మంచి ప్రదర్శన చేస్తున్న ఉమ్రాన్ మాలిక్ రెండో వన్డేలో తుది జట్టులో చోటు దక్కుతుందని అభిమానులు భావించారు. కానీ చివరికి వసీం జాఫర్ చెప్పిన విషయమే నిజం అయింది.

 మొదటి వన్డే మ్యాచ్లో ఉమ్రాన్ మాలిక్ ను తుది జట్టులోకి తీసుకోకుండా పక్కన పెట్టిన రోహిత్ శర్మ.. ఇక రెండో వన్డే మ్యాచ్లో కూడా అదే చేశాడు అని చెప్పాలి. అయితే జట్టుకు ప్రస్తుతం కేవలం ఆల్రౌండర్లు మాత్రమే కావాలంటూ వసీం జాఫర్ చెప్పగా.. అటు రోహిత్ శర్మ సైతం ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న శార్దూల్ ఠాగూర్ వైపే మొగ్గు చూపడం గమనార్హం. దీంతో ఉమ్రాన్ మాలిక్ ను పక్కన పెట్టడంతో వసీం జాఫర్ చెప్పిందే జరిగింది. రోహిత్ నిజంగానే ఉమ్రాన్  మాలిక్ ను పక్కన పెట్టాడు అంటూ అతని రివ్యూ ని గుర్తు చేసుకుంటున్నారు ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: