రోహిత్ ముందు అరుదైన రికార్డ్.. మరో 6 సార్లు కొడితే?

praveen
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం భారత క్రికెట్లో అత్యుత్తమ ఆటగాడిగా కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి. ఒకవైపు కెప్టెన్గా తనదైన వ్యూహాలతో జట్టును ముందుకు నడిపించడమే కాదు మరోవైపు ఓపెనర్ గా బరిలోకి మంచి ఆరంభాలు అందిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. అయితే ఇప్పుడు వరకు రోహిత్ శర్మ ఎన్నో ప్రపంచ రికార్డులు కొల్లగొట్టాడు అని చెప్పాలి. ఇక అంతే కాదు రోహిత్ కి  సిక్సర్ల  వీరుడు అని అటు అభిమానులు ముద్దు పేరు కూడా పెట్టుకున్నారు. ఎందుకంటే మిగతా బ్యాట్స్మెన్ లతో పోల్చి చూస్తే రోహిత్ శర్మ ఎంతో అలవోకగా బంతిని అటు బౌండరీ తరలిస్తూ ఉంటాడు అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే ప్రస్తుతం టీమిండియా జట్టు అటు న్యూజిలాండ్తో రెండో వన్డే మ్యాచ్ ఆడుతుంది. ఇప్పటికి మొదటి వన్డే మ్యాచ్లో గెలిచిన టీమిండియా రెండో వన్డేలో కూడా విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది అని చెప్పాలి. ఇక ఆ దిశగానే  అడుగులు వేస్తుంది. న్యూజిలాండ్ జట్టు 34.3 ఓవర్లలో 108 పరుగులు మాత్రమే చేసే ఆలౌట్ అయింది. దీంతో స్వల్ప లక్ష్యంతో టీమిండియా బరిలోకి దిగింది అని చెప్పాలి. అయితే ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముందు ప్రస్తుతం ఒక అరుదైన రికార్డు ఊరిస్తుంది అని చెప్పాలి.

 ఇప్పటికే సిక్సర్లు కొట్టడం విషయంలో ఎన్నో అరుదైన రికార్డులు సాధించిన రోహిత్ శర్మ ఇక ఇప్పుడు మరో రేర్ రికార్డు కి ఆరు సిక్సర్ల దూరంలో ఉన్నాడు అని చెప్పాలి. ఇక ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్లో 6 సిక్సర్లు కొట్టాడు అంటే చాలు వన్డే ఫార్మాట్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన మూడవ ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కుతాడు రోహిత్ శర్మ.  ఈ లిస్టులో షాహిద్ ఆఫ్రిథి మొదటి స్థానంలో ఉండగా.. ఆ తర్వాత గేల్ రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే రోహిత్ శర్మ తప్పకుండా ఆరు సిక్సర్లు కొడతాడని  అభిమానులు కూడా కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: