అమెరికాలో ఇండియా vs పాక్ మ్యాచ్.. ఫ్యాన్స్ వెయిటింగ్?

praveen
ప్రపంచ క్రికెట్లో చిరకాల ప్రత్యర్థులుగా కొనసాగుతున్న ఇండియా, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగడం అంటే ఇక అటు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా అసలు సీసలు ఎంటర్టైన్మెంట్ అందుతుంది అన్నదానికి కేరా అడ్రెస్ గా ఉంటుంది అని చెప్పాలి. ఎందుకంటే ఇక ప్రపంచ క్రికెట్లో అన్ని జట్ల మధ్య ప్రస్తుతం ద్వైపాక్షిక సిరీస్ లు జరుగుతూ ఉంటాయి. కానీ అటు పాకిస్తాన్, భారత్ జట్ల మధ్య మాత్రం క్రికెట్ సంబంధాలపై నిషేధం కొనసాగుతూ ఉంటుంది.

 దీంతో దాయాది జట్లుగా పిలుచుకునే ఈ రెండు టీంలు కూడా కేవలం అంతర్జాతీయ వేదికలపై మాత్రమే తలబడుతూ ఉంటాయి అని చెప్పాలి.  ఆసియా కప్ వరల్డ్ కప్ లాంటి టోర్నీలలో మాత్రమే ఇక ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ చూడొచ్చు. అంతేకాదు ఇక భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగిందంటే చాలు నువ్వా నేను అన్నట్లుగానే హోరాహోరి పోరు మ్యాచ్లో కనపడుతూ ఉంటుంది. దీంతో ఇక ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగితే చూడడానికి ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులకు రెండు కళ్ళు సరిపోవు అనడంలో సందేహం లేదు.

 కాగా గత ఏడాది ఆసియా కప్ టి20 వరల్డ్ కప్ కారణంగా ఇక రెండుసార్లు భారత్, పాకిస్తాన్ మ్యాచ్ చూసి తెగ ఎంజాయ్ చేసారు  ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు. అయితే ఇక చిరకాల ప్రత్యర్ధుల మ్యాచ్ కు అటు అమెరికాలోని ఫ్లోరిడా వేదిక కూడా సిద్ధం కాబోతుంది అన్నది తెలుస్తుంది. 2024 లో జరగబోతున్న టి20 వరల్డ్ కప్ ను అమెరికాలో జరగబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ మెగా టోర్నీలో భాగంగా జరగబోయే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కు అటు ఫ్లోరిడా ఆతిథ్యం ఇవ్వబోతుందట. అయితే ఇక వరల్డ్ కప్ కు అమెరికా ఆతిథ్యం ఇవ్వడాన్ని ఇంకా ఐసీసీ ఫిక్స్ చేయలేదు. అమెరికా సహ వెస్టిండీస్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉండగా ఇక వేదికల కోసం ఐసిసి సెర్చింగ్ ప్రారంభించినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: