బీసీసీఐ సెలెక్టర్లు.. ఫ్యాషన్ షో కి వెళ్ళండి : గవాస్కర్

praveen
ఇటీవల కాలంలో రంజీ ట్రోఫీలో మంచి ప్రదర్శన చేసిన ఆటగాళ్లు అందరికీ కూడా అటు టీమ్ ఇండియాలో అవకాశం దక్కుతుంది అని చెప్పాలి. అయితే గత కొన్నేళ్లుగా రంజీ ట్రోఫీలో అద్భుతంగా రాణిస్తూ పరుగుల వరద పారిస్తున్న సర్ఫరాజ్ ఖాన్ కి మాత్రం అటు టీమ్ ఇండియాలో చోటు అనేది కలగానే మిగిలిపోతుంది అని చెప్పాలి. అయితే ఆస్ట్రేలియా తో జరిగే టెస్ట్ సిరీస్ కోసం అతని ఎంపిక చేస్తారని ఎంతోమంది భావించారు. కానీ చివరికి నిరాశ ఎదురయింది అన్న విషయం తెలిసిందే. దీంతో ఇక సెలక్టర్లు తీరూపై ఎంతో మంది మాజీ క్రికెటర్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.
 ఇక ఇటీవల ఇదే విషయంపై అటు మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ సైతం తీవ్రంగా స్పందించారు. సెలెక్టర్లు ఆటగాళ్ల ఆకారాన్ని బట్టి కాదు ఫామ్ ను చూసి ఎంపిక చేయాలి అంటూ సూచించాడు. కేవలం స్లిమ్ గా ఉన్న వారిని మాత్రమే ఎంపిక చేయాలి అనుకుంటే ఇక సెలక్టర్లు ఫ్యాషన్ షో కి వెళ్తే అక్కడ మోడల్స్ ని ఎంచుకొని బ్యాక్ బాలు ఇచ్చి ఆపై జట్టులో చేర్చుకోవాలంటు ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అన్ఫిట్ గా ఉంటే సెంచరీలు చేయలేరు. కాబట్టి క్రికెట్లో ఫిట్ నెస్ చాలా ముఖ్యం
 కానీ యోయో టెస్ట్ పాస్ అయితేనే జట్టులో ఉండడానికి అర్హుడు అంటే మాత్రం ఒప్పుకోను. ఎందుకంటే యో యో టెస్టు ఒక ఆటగాడి ప్రతిభకు  ప్రామాణికం కాదు. సెంచరీలు బాదుతున్నాడు అంటే అతడు క్రికెట్ ఆడటానికి ఫిట్గా ఉన్నాడని అర్థం అంటూ సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించాడు.

 దేశవాళి క్రికెట్లో అటు సర్పరాజ్ ఖాన్ టన్నుల కొద్దీ పరుగులు చేస్తున్నాడు. అయినప్పటికీ అతనికి జాతీయ జట్టు నుంచి మాత్రం పిలుపు రావడం లేదు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రెండు టెస్టుల కోసం ఇటీవల భారత జట్టును ప్రకటించారు. ఈ సిరీస్ కు సెలక్టర్ నుంచి పిలుపు వస్తుందని సర్ఫరాజ్ ఖాన్ ఆశించాడు. కానీ అతనికి మరోసారి నిరాశ ఎదురయింది. ఈ క్రమంలోనే ఈ విషయంపై తీవ్రంగా స్పందించిన సునీల్ గవాస్కర్  సెలెక్టర్ల తీరును ఎండగడుతూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: