ప్రియురాలు పేరు తీయగానే.. గిల్ ఎంత సిగ్గుపడ్డాడో చూడండి!

praveen
భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ జట్టు ప్రస్తుతం టీమిండియాతో వన్డే సిరీస్ ఆడుతుంది. సిరీస్ లో భాగంగా  అదిరిపోయే ప్రదర్శన చేస్తుంది అన్న విషయం తెలిసిందే. మొదటి వన్డే మ్యాచ్ లోనే 12 పరుగులు తేడాతో విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్ లో భాగంగా యువ ఆటగాడు శుభమన్ గిల్ డబుల్ సెంచరీ తో చెలరేగిపోయాడు. తద్వారా జట్టు విజయంలో కీలక పాత్ర వహించి ఇక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా దక్కించుకున్నాడు.

 అయితే శుభమన్ గిల్ డబుల్ సెంచరీ చేసిన నేపథ్యంలో ఇక అతనికి సంబంధించిన ఏ వార్త తెరమీదకి వచ్చిన అది అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంది అని చెప్పాలి. ఇక ఇప్పుడు అతనికి సంబంధించిన ఒక ఫన్నీ వీడియో కాస్త వైరల్ గా మారిపోయింది. ఇది చూసి నెటిజన్స్ అందరూ కూడా నవ్వుకుంటున్నారు అని చెప్పాలి. సాధారణంగా క్రికెటర్లు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు అటువైపుగా అభిమానులు ఇక క్రికెటర్లను కలవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక్కడ ఇలాంటిదే జరిగింది.
 మొదటి మ్యాచ్ ముగిసిన తర్వాత గిల్ ఇక సహచరులతో కలిసి బస్సులో వెళ్తున్నాడు. ఇలాంటి సమయంలోనే బస్సు పక్కన ఉన్న తన అభిమానులకు కరచాలనం చేశాడు. ఈ సమయంలో అభిమానులు అతన్ని ఆటపట్టించారు. సచిన్కే ధ్యాన్ రక్నా అంటూ సూచించారు. అంటే సచిన్ ను జాగ్రత్తగా చూసుకో అంటూ ఆట పట్టించారు. దీంతో ఒక్కసారిగా సిగ్గు పడిపోయిన గిల్ బస్ విండోను క్లోజ్ చేసేసాడు. అయితే అభిమానులు ఇలా అనడానికి పెద్ద కారణమె ఉంది. శుభమన్ గిల్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ ప్రేమలో ఉన్నారని ఎప్పటినుంచి వార్తలు వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇద్దరు సోషల్ మీడియాలో ఒకరిని ఒకరు ఫాలో అవ్వడమే కాదు ఒకరి పోస్టులకి ఒకరు లైక్లు కూడా కొట్టుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: