కెప్టెన్ రోహిత్ కు.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన ఇషాన్ కిషన్?

praveen
టీమిండి ఆటగాళ్లందరూ మైదానంలో మ్యాచ్ ఆడుతున్న సమయంలో ఎంత అగ్రసివ్ గా ఉన్నప్పటికీ.. ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత మాత్రం ఇక జూనియర్లు సీనియర్లు అనే తేడా లేకుండా అందరూ సరదాగా గడుపుతూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు పంచులు వేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి టీమిండియా ప్లేయర్స్ ఎవరైనా సరదాగా మాట్లాడుకుంటూ ఉన్న వీడియో ఏదైనా తెరమీదకి వచ్చిందంటే చాలు అది కాస్త హాట్ టాపిక్ గా మారిపోతూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు ఇలాంటి వీడియో ఒకటి ట్విట్టర్ వేదికగా చక్కర్లు కొడుతుంది అని చెప్పాలి.

 టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు డబుల్ సెంచరీ వీరుడిగా పేరు ఉంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఇప్పటివరకు వన్డే ఫార్మాట్లో మూడుసార్లు డబుల్ సెంచరీ మార్క్ అందుకున్నాడు రోహిత్ శర్మ. అయితే ఇటీవల రోహిత్ శర్మ తర్వాత యువ ఆటగాళ్లు ఇషాన్ కిషన్, శుభమన్ గిల్ కూడా డబుల్ సెంచరీ మార్క్ అందుకొని ఆ క్లబ్లో చేరిపోయారు. గతంలో బంగ్లాదేశ్ తో జరిగిన మూడో వన్డే మ్యాచ్లో ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ చేస్తే ఇక ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో గిల్ డబుల్ సెంచరీ తో చెలరేగిపోయాడు.

 ఇషాన్ డబుల్ సెంచరీ తర్వాత అతనికి టీమిండియాలో స్థానం సుస్థిరం అయినట్లే అని అందరూ అనుకున్నారు. కానీ తర్వాత 3 మ్యాచ్ల పాటు అతని టీమిండియా కు దూరంగానే ఉన్నాడు. ఇక ఇదే విషయంపై ఏకంగా కెప్టెన్ రోహిత్ శర్మకే కౌంటర్ ఇచ్చాడు ఇశాన్ కిషన్ ఇటీవల గిల్, ఇషాన్ లను రోహిత్ ఇంటర్వ్యూ చేశాడు. ఈ క్రమంలోనే కిషన్ తో మాట్లాడుతూ నువ్వు బంగ్లాదేశ్ పై రెండు వందలు కొట్టిన తర్వాత తర్వాత మూడు మ్యాచ్లు ఆడలేదు అంటూ ప్రశ్నించగానే.. బ్రదర్ నువ్వే కదా కెప్టెన్ వి. నన్ను నువ్వే తీసేయగలవు అంటూ రోహిత్ కూ కౌంటర్ వేసేసరికి   అందరూ ఒక్కసారిగా నవ్వుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: