అదేమి గుండె భయ్యా... మూడు వరుస సిక్సులతో గిల్ "డబుల్ సెంచరీ" !

VAMSI
శ్రీలంకతో జరిగిన టీ 20 మరియు వన్ డే సిరీస్ లో ఆద్యంతం అద్భుతంగా రాణించిన టీం ఇండియా కన్ను ఇప్పుడు వరల్డ్ నెంబర్ వన్ న్యూజిలాండ్ మీద పడిందని చెప్పాలి. ఈ రోజు నుండి ఉప్పల్ వేదికగా మూడు వన్ డే లు మరియు మూడు టీ 20 లకోసం కివీస్ భారత పర్యటనకు వచ్చింది. అందులో భాగంగా మొదట టాస్ గెలిచిన ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ కు స్వర్గధామం లా ఉండే పిచ్ పై బ్యాటింగ్ తీసుకున్నాడు. ఇండియా ఓఎపినెర్లు రోహిత్ మరియు గిల్ లుమరోసారి ఇన్నింగ్స్ ను ప్రారంభించారు. అయితే శ్రీలంక సిరీస్ లో లాగా రోహిత్ వచ్చిన మంచి స్టార్ట్ ను చెత్త షాట్ ను ఆడి అవుట్ అయ్యాడు.
మరోవైపు శుబ్మాన్ గిల్ మాత్రం ఎంతో అనుభవం ఉన్న ఆటగాడిలా ఆచితూచి ఆడుతూ నెమ్మదిగా ఇన్నింగ్స్ ను నిర్మించే పనిలో పడ్డాడు. ఈ దశలోనే కెరీర్ లో మూడవ సెంచరీని అందుకున్నాడు. ధావన్ తర్వాత కేవలం 17 ఇన్నింగ్స్ ల తర్వాత మూడు సెంచరీలు చేసిన ఆటగాడిగా ఘనతను సాధించాడు. ఇది సరిపోదు అనుకున్నాడో ఏమో కానీ... డబుల్ సెంచరీ మీదనే కన్నేశాడు. అందుకే చివరి వరకు ఆవేశపడకుండా నెమ్మదిగా పరుగు పరుగు జత చేసుకుంటూ 142 బంతులలో 182 పరుగులకు చేరుకున్నాడు. ఆఖరి రెండు ఓవర్ లలో గిల్ మరో 18 పరుగులు చేస్తే డబుల్ సెంచరీ పూర్తవుతుంది. అప్పటికే టీం 7 వికెట్లను కోల్పోయింది.. క్రీజులో తనతో పాటు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఉన్నాడు. ఏ మాత్రం తేడా జరిగినా గిల్ డబుల్ సెంచరీ కల నెరవేరడం జరగదు.
అందుకే ఫెర్గుసన్ వేసిన పెనల్టిమేట్ ఓవర్ ను లక్ష్యంగా చేసుకున్నాడు. అప్పట్లో సెహ్వాగ్ లాగా అతనిపై చెలరేగిపోయాడు... వరుసగా వేసిన మూడు బంతులను సిక్సర్ లుగా మలిచి కేవలం 145 బంతుల్లోనే సరిగ్గా 200 పరుగులను పూర్తి చేసుకున్నాడు. మాములుగా అయితే నెమ్మదిగా ఫోర్ కొట్టి లేదా సింగిల్ తీసి డబుల్ సెంచరీ చేస్తారు. కానీ గిల్ మాత్రం ఎటువంటి భయం లేకుండా వరుసగా సిక్సులు బాది డబుల్ కొట్టాడు. కెరీర్ లో గిల్ కు ఇదే మొదటిది కావడం విశేషం. కాగా మరో ఘనతను కూడా తన పేరిట లిఖించుకున్నాడు.. బంగ్లాతో వన్ డే లో డబుల్ సెంచరీ చేసిన ఇషాన్ కిషన్ వయసు 24 సంవత్సరాల 145 రోజులు కాగా, ఇప్పుడు గిల్ కు కేవలం 23 సంవత్సరాల 135 రోజులే కావడంతో... డబుల్ సెంచరీ చేసిన అతి చిన్న వయసు వాడిగా రికార్డ్ సాధించాడు.    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: