వరుస సెంచరీలతో వరల్డ్ కప్ బెర్త్ కంఫర్మ్ చేసుకున్న యంగ్ స్టార్ క్రికెటర్ ?

VAMSI
ప్రస్తుతం మెన్ క్రికెట్ టీం లో చోటు కోసం విపరీతమైన పోటీ నెలకొంది. దీనికి కరాం దేశవ్యాప్తంగా ప్రతిభ ఉన్న కుర్రాళ్ళు వెలుగులోకి వస్తుండడమే అని చెప్పాలి. ఐపీఎల్ మరియు ఇతర దేశవాళీ టోర్నీల ద్వారా ఎందరో కుర్రాళ్ళు తమ అద్బుతమయిన ఆటతీరుతో ఇండియా సెలెక్టర్లను ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికే ఆలా ఎంతోమంది టీం ఇండియా జట్టులో చోటు సంపాదించుకుని కెరీర్ లో గొప్ప స్థాయికి ఎదిగారు. అలాంటి వారిలో ఒకరే పంజాబ్ కు చెందిన శుబ్మాన్ గిల్. కేవలం 23 సంవత్సరాలు మాత్రమే ఉన్న ఈ యంగ్ ఇండియన్ క్రికెటర్ ఇప్పుడు టీం ఇండియా లో ఒక పెను సంచలనం అని చెప్పాలి.
గిల్ 2018 నుండి ఐపీఎల్ లో కీలక ప్లేయర్ గా కొనసాగుతున్నాడు. ఇక 2019 నుండి టెస్ట్ వన్ డే మరియు టీ 20 ఫార్మాట్ లలో చోటు సంపాదించుకుని కెరీర్ ను ముందుకు తీసుకువెళుతున్నారు. ఇప్పటి వరకు టెస్ట్ లు 13, వన్ డే లు 17 మరియు 3 టీ 20 లు మాత్రమే ఆడాడు. ఇక టెస్ట్ లు మరియు వన్ డే లలో రెగ్యులర్ ఆటగాడిగా మారిపోయాడని చెప్పాలి. ఇక తాజాగా జరుగుతున్న న్యూజిలాండ్ మొదటి వన్ డే లో సెంచరీ సాధించడం ద్వారా గిల్ ధావన్ తర్వాత కేవలం 17 ఇన్నింగ్స్ లలో మూడు సెంచరీలు చేసిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు.
ఈ సంవత్సరం జరగనున్న వన్ డే ప్రపంచ కప్ లో సభ్యుడుగా ఎంపిక కావడానికి అందరూ ఎంతగానో శ్రమిస్తున్నారు. అయితే కొంతకాలంగా ఇండియాకు పరిష్కారం లేని ప్రశ్నగా మిగిలిన మంచి ఓపెనింగ్ కోసం వెతుకుతూనే ఉన్నారు. అయితే బంగ్లాతో వన్ డే లలో ఇషాన్ కిషన్ డబల్ సెంచరీతో ఆకట్టుకున్నా, వరుసగా విఫలం అవుతున్నాడు. ఈ రోజు మ్యాచ్ లో కూడా పేలవమైన ఆటతీరుతో అభిమానులను నిరాశపరిచాడు. ఇటువంటి సమయంలో శుబ్ మాన్ గిల్ మొన్న శ్రీలంక మీద సెంచరీ , మళ్ళీ ఈ రోజు సెంచరీ సాధించడంతో వరల్డ్ కప్ టీంలో రోహిత్ కు సరసన మరో ఓపెనర్ గా గిల్ ఉండడం కంఫర్మ్ అని తేలిపోయింది. ముఖ్యంగా ఎంతో కన్సిస్టెంట్ గా ఆడుతూ నెమ్మదిగా ఇన్నింగ్స్ ను నిర్మించే విధానం సీనియర్ లను సైతం ఆకట్టుకుంటోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: