సెంచరిలతో లంక బౌలర్లని చిత్తు చేసిన కోహ్లీ, గిల్?

Purushottham Vinay
శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో భారత క్రికెట్ జట్టు భారీ స్కోరు చేసింది. కింగ్ కోహ్లీ విరాట్ కోహ్లీతో పాటు ఓపెనర్‌ శుభ్‌మాన్‌ గిల్‌ సెంచరీలతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి మొత్తం 390 పరుగులు చేసింది టీమిండియా.ఇంకా ఈ మ్యాచ్‌లో హైలెట్‌ అంటే విరాట్ కోహ్లీ అనే చెప్పాలి. 85 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లీ ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఫోర్లు, సిక్సర్లు బాది చెలరేగాడు. మొత్తం 110 బంతుల్లో విరాట్‌ 166 పరుగులు చేశాడు. విరాట్ ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. ఇక గిల్ 97 బంతుల్లో 116 పరుగులు చేశాడు. ఇందులో14 ఫోర్లు ఇంకా రెండు సిక్సర్లు ఉన్నాయి.శుబ్ మాన్ గిల్ వన్డే కెరీర్‌లో ఇది రెండో సెంచరీ. అంతకుముందు జింబాబ్వేపై ఈ యంగ్ మ్యాన్ సెంచరీ సాధించాడు. ఇక వన్డేల్లో కోహ్లీకి ఇది రెండో అత్యధిక స్కోరు.ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రోహిత్‌ ఇంకా గిల్‌లు టీమ్‌ఇండియాకు మంచి శుభారంభం అందించారు. శ్రీలంక బౌలర్లపై ఈజీగా ఆధిపత్యం చెలాయించారు. అయితే 95 పరుగుల వద్ద ఇండియా తొలి వికెట్ కోల్పోయింది. రోహిత్‌ను ఔట్ చేసి ఇండియాకి తొలి దెబ్బ కొట్టాడు చమిక కరుణరత్నే.


రోహిత్ మొత్తం 49 బంతుల్లో 42 పరుగులు చేశాడు. రోహిత్ తన ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి.ఇక రోహిత్ శర్మ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ గిల్‌తో కలిసి శ్రీలంక బౌలర్లను చిత్తు చిత్తు చేశారు. రెండో వికెట్‌కు ఫాస్ట్ గా 131 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 226 పరుగుల వద్ద గిల్‌ ఔటైనా కోహ్లీ తన దూకుడును పెంచాడు. వరుస బౌండరీలతో సిరీస్‌లో రెండో సెంచరీ  చేశాడు. అంతకుముందు తొలి వన్డేలో కూడా అతను సెంచరీ సాధించాడు. ఇక శ్రీలంకపై వన్డేల్లో కోహ్లీకి ఇది మొత్తంగా 10వ సెంచరీ. శ్రేయస్‌ అయ్యర్‌ 38 పరుగులతో రాణించగా, రాహుల్‌ (7) ఇంకా సూర్యకుమార్‌ యాదవ్‌ (4) విఫలమయ్యారు. ఇక అక్షర్ పటేల్ రెండు పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. శ్రీలంక తరుపున చూస్తే రచిత 10 ఓవర్లలో 81 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. లహిరు కుమార 10 ఓవర్లలో మొత్తం 87 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. కరుణరత్నే మొత్తం 8 ఓవర్లలో 58 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: