వన్డే క్రికెట్ లోకి.. తెలుగోడు అరంగేట్రం?

praveen
ఇటీవల కాలంలో టీమ్ ఇండియాలో ఎంతో మంది యువ ఆటగాళ్ళు అవకాశం దక్కించుకుంటున్నారు. అయితే ఇలా అవకాశం వచ్చినప్పటికీ కొంతమంది కేవలం బెంచ్  కు మాత్రమే పరిమితం అయితే.. మరికొంతమంది మాత్రం తుది జట్టులోకి వచ్చి తమ సత్తా ఏంటో నిరూపించుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే గత కొంతకాలం నుంచి టీమిండియా తరఫున వరుసగా అవకాశాలు దక్కించుకున్న తెలుగు క్రికెటర్ కె.ఎస్ భరత్ అటు తుది జట్టులో మాత్రం అవకాశాలు దక్కించుకోలేకపోతున్నాడు.

 ఒకవేళ ఎవరైనా ఆటగాడు గాయపడి ఇక తుదిజ ట్టులో కేఎస్ భరత్ అవకాశం దక్కించుకున్నా అంటే ఇక వచ్చిన అవకాశాన్ని బాగా రానించి అతని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు అని చెప్పాలి. అయితే ఇప్పటివరకు కేవలం టెస్టుల్లో మాత్రమే టీం ఇండియా తరపున అవకాశాలు దక్కించుకున్నాడు. ఇక అప్పుడప్పుడుటి20 ఫార్మాట్లో కూడా అవకాశాలు దక్కించుకున్న బెంచ్ కి పరిమితం అయ్యాడు కేఎస్ భరత్. అయితే మొదటిసారి ఇక వన్డే ఫార్మాట్లో అరంగేట్రం చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే ఇటీవల న్యూజిలాండ్ తో భారత్ వేదికగా జరగబోయే టి20 వన్డే ఫార్మాట్ లో ఆడబోయే జట్టును ఇటీవలే ప్రకటించింది. శ్రీలంకతో టి20 సిరీస్ ఆడిన జట్టుని అటు కివీస్ తో  టి20 సిరీస్ ఆడేందుకు సెలెక్ట్ చేసింది. ఇకపోతే ఇక వన్డే సిరీస్ లో భాగంగా అటు ఆంధ్ర క్రికెట్ కీపర్ కేఎస్ భరత్ తొలిసారి అవకాశం లభించింది.. ప్రస్తుతం రిషబ్ పంత్ గాయం బారిన పడి దూరం కావడం.. కేఎల్ రాహుల్ పెళ్లి కారణంగా లీవ్ లో ఉండడంతో ఇక భరత్ కి వికెట్ కీపర్ గా అవకాశం లభించింది అన్నది తెలుస్తుంది. ఒక వ్యక్తిగత కారణాలతో అటు అక్షర్ పటేల్ కూడా జట్టుకు దూరమవుతున్నాడు. దీంతో వచ్చిన అవకాశాన్ని తెలుగు క్రికెటర్ ఎలా ఉపయోగించుకుంటాడు అన్నది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: