కోహ్లీ గురించి నేటిజన్ ప్రశ్న.. షారుక్ ఖాన్ ఏమన్నాడో తెలుసా?

praveen
ప్రస్తుతం టీమిండియాలో మాజీ కెప్టెన్ గా కీలక బ్యాట్స్మెన్ గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ అటు ప్రపంచ క్రికెట్లో అభిమానులందరికీ కూడా రికార్డుల రారాజుగా కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి. అంతేకాదు ఎంతో మంది అభిమానులు విరాట్ కోహ్లీని రన్ మిషన్ అని ఎంతో ముద్దుగా కూడా పిలుచుకుంటూ  ఉంటారు. ఎందుకంటే అతను అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసి దాదాపు దశాబ్ద కాలం గడిచిపోతున్న ఇంకా ఏదో నిరూపించుకోవాలని ఆరాటపడే కొత్త ఆటగాడిలాగానే ప్రతి మ్యాచ్ లో కూడా కనబడుతూ ఉంటాడు అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే ప్రతి మ్యాచ్లో కూడా భారీగా పరుగులు చేస్తూ ఇక టీమిండియా విషయంలో కీలక పాత్ర వహిస్తూ ఉంటాడు. అయితే ఇక రికార్డులు సాధించడం విషయంలో కూడా నేటి జనరేషన్ క్రికెటర్లకు అందనంత దూరంలో ఉన్నాడు విరాట్ కోహ్లీ. ఇకపోతే దాదాపు మూడేళ్లు వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడిన విరాట్ కోహ్లీ మళ్లీ మునుపాటి ఫామ్ను అందుకొని ఇక ఇప్పుడు ఎప్పటిలాగానే దూసుకుపోతూ ఉన్నాడు. శ్రీలంకతో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో కూడా సెంచరీ చేసి అదరగొట్టాడు అన్న విషయం తెలిసిందే.

 ఈ క్రమం లోనే ఎంతోమంది విరాట్ కోహ్లీ ఆట తీరుపై ప్రశంసల కురిపిస్తున్నారు. ఇక పోతే ఇటీవలే బాలీవుడ్లో స్టార్ హీరోగా కొనసాగుతున్న షారుఖ్ ఖాన్ సైతం విరాట్ కోహ్లీని పొగడ్తల తో ఆకాశానికెత్తేశాడు. ప్రస్తుతం అతను నటించినా పఠాన్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సోషల్ మీడియా వేదికగా ఆస్క్ షారుఖాన్ అనే పేరుతో ఒక చిట్ చాట్ నిర్వహించాడు. ఈ క్రమంలోనే  ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. ఈ క్రమంలోనే ఒక నేటిజన్ కోహ్లీ గురించి చెప్పాలని కోరగా.. అతను ఒక అద్భుతం.. అతను ఎప్పుడు ఉత్తమంగా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ షారుక్ ఖాన్ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: