ఏంటి.. ఉమ్రాన్ ఫాస్టెస్ట్ డెలివరీ.. లెక్కలోకి రాదా?

praveen
రోజులు గడుస్తున్న కొద్ది ఉమ్రాన్ మాలిక్ తన స్పీడ్ బౌలింగ్తో ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఒకవైపు వేగంతో బంతులు వేయడమే కాదు మరోవైపు బౌలింగ్లో వైవిధ్యాన్ని చూపిస్తూ అధరగొడుతున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే టీమ్ ఇండియాలో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ తన స్పీడ్ బౌలింగ్ తో విద్యార్థులకు వణుకు పుట్టిస్తూ ఉన్నాడు. అతని బౌలింగ్ వేగం చూసి ఎక్కడ గాయాలు అవుతాయో ఏమో అని ఇక ప్రత్యర్థి జట్టు బ్యాట్స్మెన్లు అందరూ కూడా భయపడిపోతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇకపోతే ఇటీవల శ్రీలంకతో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో భాగంగా అటు భారత జట్టు భారీ పరుగుల తేడాతో విజయం సాధించింది అని చెప్పాలి.

 ఇక ఈ మ్యాచ్ లో భాగంగా ఎప్పటిలాగానే ఉమ్రాన్ మాలిక్ తన ఫాస్ట్ బౌలింగ్ తో  అదరగొట్టాడు.. ఏకంగా అందరికంటే ఎక్కువ వికెట్లు పడగొట్టాడు అని చెప్పాలి. మ్యాచ్ మొత్తంలో మూడు వికెట్లు తీసి ఔరా అనిపించాడు. ఒకరకంగా తన బౌలింగ్ తో ప్రత్యర్థి శ్రీలంక నడ్డి విరిచాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే 14 ఓవర్ లో ఉమ్రాన్ మాలిక్ వేసిన నాలుగోబంతి 156 కిలోమీటర్ల వేగంతో వేయడం గమనార్హం. దీంతో అత్యంత వేగంగా బంతిని సందించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అయితే ఈ బంతి విషయంలో ప్రస్తుతం కాంట్రవర్సీ తెరమీదికి వచ్చింది.

 అయితే ఇంగ్లీష్ బ్రాడ్ కాస్టింగ్ లో మాత్రం ఈ విషయం అసలు ప్రస్తావనికే రాలేదు అనే విషయం తెలిసిందే. హిందీలో 156 కిలోమీటర్ల వేగం గుర్తించిన అదే డెలివరీ ని ఇంగ్లీష్ బ్రాడ్ కాస్టింగ్ లో మాత్రం కేవలం 145.7 కిలోమీటర్ల వేగం మాత్రమే చూపించారు. దీంతో అభిమానులు దేన్నీ నమ్మాలో తెలియక.. కన్ఫ్యూషన్ లో పడిపోయారు అని చెప్పాలి. దీంతో ఇటీవలే ఉమ్రాన్ మాలిక్ 156 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరి భారత క్రికెట్లో ప్రత్యేకమైన రికార్డు సాధించగా.. అసలు ఆ బంతి లెక్కలోకి వస్తుందా లేదా అన్నది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: