వారెవ్వా.. కోహ్లీ అరుదైన ప్రపంచ రికార్డు?

praveen
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి అటు ప్రపంచ క్రికెట్లో రికార్డుల రారాజు అనే ఒక బిరుదు ఉంది అన్న విషయం తెలిసిందే. అతని సాధించిన రికార్డుల కారణంగా క్రికెట్ అభిమానులు అందరూ కూడా అతనికి ఈ బిరుదును కట్టబెట్టారు. అయితే నేటి జనరేషన్ క్రికెటర్లతో పోల్చి చూస్తే విరాట్ కోహ్లీ ఎవరికి అందనంత దూరంలో రికార్డులను సాధించి అగ్రస్థానంలో కూర్చుని ఉన్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అని చెప్పాలి.

 ఫార్మాట్ తో సంబంధం లేకుండా ఎప్పుడూ అత్యుత్తమమైన ప్రతిభ కనబరిచే విరాట్ కోహ్లీ తన ప్రదర్శనతో ఎప్పుడూ ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు అని చెప్పాలి. ఇక మొన్నటి వరకు ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడిన కోహ్లీ మళ్ళీ మునుపటి ఫామ్ అందుకుని సెంచరీలతో చెలరేగిపోతూ ఉన్నాడు. ఇకపోతే ఇటీవల శ్రీలంకతో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో భాగంగా విరాట్ కోహ్లీ సెంచరీ సాధించి అదరగొట్టాడు అని చెప్పాలి. తద్వారా తన కెరియర్ లో 73వ సెంచరీని నమోదు చేశాడు విరాట్ కోహ్లీ.  ఇక ఈ సెంచరీ తో ఎన్నో ప్రపంచ రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు అని చెప్పాలి.

 ఇక రికార్డులు సాధించడమే కాదు ఇక ఈ అద్భుతమైన సెంచరీ  తో టీమిండియా విజయంలో కూడా కీలక పాత్ర వహించాడు అని చెప్పాలి. అదే సమయంలో ఇక విరాట్ కోహ్లీ తన సెంచరీ తో ఒక అరుదైన ప్రపంచ రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. విరాట్ కోహ్లీ సెంచరీ చేసిన 37 సార్లు టీమ్ ఇండియా ఆ మ్యాచ్లలో విజయం సాధించడం గమనార్హం. దీంతో వన్డే క్రికెట్ చరిత్రలో 37 విన్నింగ్ నాక్స్ ఆడిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డును సృష్టించాడు. ఇక మరోవైపు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన కెరియర్లో 33 సార్లు విన్నింగ్ నాక్స్ ఆడాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: