IND vs SL: సచిన్ రికార్డుకి అడుగు దూరంలో కోహ్లీ?

Purushottham Vinay
ఇండియా ఇంకా శ్రీలంక మధ్య మూడు వన్డేల సిరీస్ మంగళవారం నుంచి స్టార్ట్ కానుంది. ఈ సిరీస్‌లో ఫస్ట్ మ్యాచ్ గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.అయితే టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఈ మ్యాచ్ చాలా ప్రత్యేకం. ఈ ఫస్ట్ వన్డేలో విరాట్ సరికొత్త రికార్డు సృష్టించేందుకు రెడీ అయ్యాడు. ఇది కనుక సాధ్యమైతే సచిన్ టెండూల్కర్ ప్రత్యేక రికార్డును ఈజీగా బద్దలు కొట్టడం ఖాయం.అయితే ఇందుకోసం కోహ్లీ ఓ సెంచరీని చేయాల్సి ఉంది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ చాలా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. గతంలో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో సెంచరీ సాధించి మళ్ళీ తానేంటో నిరూపించాడు కింగ్ కోహ్లీ.సచిన్ టెండూల్కర్  పేరిట ఎన్నో రికార్డులు ఉన్నాయి. రెండు దశాబ్దాలకు పైగా క్రికెట్‌ను శాసించిన  మాస్టర్ బ్లాస్టర్.. వన్డేలో సెంచరీల విషయానికి వస్తే.. ఇండియాలో అత్యధికంగా మొత్తం 20 సెంచరీలు చేశాడు.


ఇక విరాట్ కోహ్లీ ఇండియాలో 19 సెంచరీలు చేసి రెండో స్థానంలో ఉన్నాడు. ఇంకా ఇది కాకుండా సచిన్ శ్రీలంకపై మొత్తం 8 సెంచరీలు సాధించాడు. విరాట్ కోహ్లీ కూడా ఈ విజిటింగ్ టీమ్‌పై వన్డేల్లో ఏకంగా 8 సెంచరీలు చేశాడు. శ్రీలంకతో జరుగుతున్న ఫస్ట్ వన్డేలో కింగ్ కోహ్లి కనుక సెంచరీ సాధిస్తే.. ఖచ్చితంగా సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టినట్టే.అయితే ఇప్పుడు ప్రత్యర్థి జట్టు శ్రీలంక పై అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డును విరాట్ కోహ్లీ సమం చేశాడు.ఇక వన్డే క్రికెట్‌లో ఆస్ట్రేలియాపై సచిన్ ఏకంగా 9 సెంచరీలు సాధించాడు.ఇంకా అదే సమయంలో, విరాట్ కోహ్లీ వెస్టిండీస్‌పై వన్డేల్లో మొత్తం 9 సెంచరీలు సాధించాడు. ఇక శ్రీలంకతో మంగళవారం నాడు జరిగే వన్డేలో విరాట్ కోహ్లి సెంచరీ కనుక చేస్తే.. సచిన్ టెండూల్కర్ రికార్డును సునాయసంగా బద్దలు కొట్టినట్టే. మరి ఫస్ట్ మ్యాచ్‌లో కింగ్ కోహ్లి ఈ రికార్డ్ చేయగలడా లేదా అన్నది ఇప్పుడు దేశావ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: