ఉమ్రాన్ ను చూస్తే.. అతనే గుర్తొస్తున్నాడు : జడేజా

praveen
ఇటీవల కాలంలో టీమ్ ఇండియాలో వరుసగా అవకాశాలు దక్కించుకుంటున్న  కాశ్మీరీ యువ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ మెరుపులాంటి తన బోలింగ్తో అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంటున్నాడు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల శ్రీలంకతో జరిగిన టి20 సిరీస్ లో భాగంగా అవకాశం దక్కించుకున్న ఉమ్రాన్ మాలిక్ ఏకంగా మూడు మ్యాచ్లలో 7 వికెట్లు తీసి సత్తా చాటాడు అని చెప్పాలి. అంతేకాదు ఇక శ్రీలంకతో జరిగిన సిరీస్ లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్ గా కూడా రికార్డ్ సృష్టించాడు.

 అయితే కొన్ని కొన్ని సార్లు భారీగా పరుగులు సమర్పించుకుంటూ ఉన్నప్పటికీ.. వికెట్లు మాత్రం పడగొడుతూ ఉండడం టీమిండియా కు ప్లస్ పాయింట్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో ఉమ్రాన్ మాలిక్ తన ప్రదర్శనతో తన స్థానాన్ని టీమ్ ఇండియాలో సుస్థిరం చేసుకుంటున్నాడు. ఇకపోతే ఇటీవల శ్రీలంకతో జరిగిన టి20 సిరీస్ లో అతని ప్రదర్శన పై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు ప్రశంసలు కురిపిస్తున్నారని చెప్పాలి. ఇక ఇదే విషయంపై భారత మాజీ ఆటగాడు అజయ్  జడేజా స్పందించాడు.

 స్పీడ్ గన్ ఉమ్రాన్ మాలిక్ ను దిగ్గజ బౌలర్ అయిన జవగల్ శ్రీనాథ్ తో పోలుస్తూ ఏకంగా ప్రశంసలు కురిపించాడు అజయ్ జడేజా. ఉమ్రాన్ మాలిక్ లాంటి బౌలర్లు చాలా అరుదుగా టీమిండియాలోకి వస్తూ ఉంటారు. భారత్లో మాత్రం చాలా కాలం తర్వాత ఉమ్రాన్ వంటి చూశాను. గతంలో జావ గల్ శ్రీనాథ్ కూడా ఈ విధమైన స్పీడ్ బౌలింగ్ తో స్టార్ బౌలర్గా ఎదిగాడు. ఇక ఇప్పుడు ఇమ్రాన్ మాలిక్ ను చూస్తున్న శ్రీనాథ్ గుర్తొస్తున్నాడు. ఉమ్రాన్ లో ఏదో ఒక ప్రత్యేకత ఉంది. అతన్ని టీమిండియా బాగా ఉపయోగించుకోవాలి అంటూ అజయ్ జడేజా వ్యాఖ్యానించాడు. డెత్ ఓవర్లలో బౌలింగ్ చేసే సత్తా కూడా అతనికి ఉంది అంటూఅభిప్రాయపడ్డాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: