సూర్య కుమార్ కు.. నేను బౌలింగ్ చేసి ఉంటేనా : హార్దిక్

praveen
ప్రస్తుతం భారత క్రికెట్లో అందరూ కూడా సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన ఇన్నింగ్స్ గురించి చర్చించుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే. ఇటీవల శ్రీలంకతో జరిగిన మూడవ టి20 మ్యాచ్ లో మరోసారి తన బ్యాట్ తో వీరవిహారం చేశాడు సూర్య కుమార్ యాదవ్. సిక్సర్లు ఫోర్ లతో చెలరేగిపోయి మరోసారి పరుగుల బోర్డును సైతం అలసిపోయేలా చేశాడు అని చెప్పాలి. అంతేకాదు ఇక ప్రత్యర్థి బౌలర్లు మరోసారి సూర్య కుమార్ బ్యాటింగ్ అంటే చాలు భయపడిపోయే విధంగా తన విధ్వంసాన్ని కొనసాగించాడు. ఏకంగా 45 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకొని అదరగొట్టాడు అని చెప్పాలి. మొత్తంగా 51 బంతుల్లో 112 పరుగులు చేశాడు.

 ఇక సూర్యకుమార్ అద్భుతమైన ఇన్నింగ్స్ లో సిక్సర్లు  ఫోర్ ల ద్వారా వచ్చిన పరుగులే ఎక్కువగా ఉన్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దీంతో అతని అద్భుతమైన ఇన్నింగ్స్ గురించి అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఇటీవల కెప్టెన్ హార్థిక్ పాండ్యా సైతం ఇదే విషయంపై  మాట్లాడాడు. అయితే సూర్యకుమార్ తన విధ్వంసకర ఆట తీరుతో అందరినీ ఆశ్చర్యం లో ముంచేస్తున్నాడు  అంత సులభంగా అతను ఎలా బ్యాటింగ్ చేయగలుగుతున్నాడో అసలు అర్థం కావట్లేదు.  ఒకవేళ నేను బౌలర్ అయి ఉంటే మాత్రం అతను కొట్టిన షాట్లకు కచ్చితంగా భయపడేవాడిని.

 ఎందుకంటే మూడవ టి20 మ్యాచ్లో సూర్యకుమార్ ఆడిన అద్భుతమైన షాట్లు అలా ఉన్నాయి. మైదానం నలుమూలలా కూడా ఎక్కడ వదలకుండా సూర్య కుమార్ షాట్లు ఆడాడు. ఇక యువ ఆటగాడు రాహుల్ త్రిపాఠి కూడా అద్భుతంగా రానించాడు అంటూ హార్దిక్ పండుగ చెప్పుకొచ్చాడు. ఇక కెప్టెన్ హార్దిక్ పాండ్యా సూర్యకుమార్ ను ఇలా పొగడ్తలతో ఆకాశానికేత్తేయడంతో సూర్య భాయ్ అభిమానుల సైతం సంతోషంలో మునిగిపోతున్నారు అని చెప్పాలి. కాగా టీమిండియా మూడవ టి20 మ్యాచ్ లో గెలిచి ఇక 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: