ఫేమ్ ఒక వ్యాధి లాంటిది.. కోహ్లీ పోస్ట్ వైరల్?

praveen
విరాట్ కోహ్లీ.. ఈ పేరు గురించి కొత్తగా పరిచయం చేస్తే అది అతిశయోక్తి అవుతుంది అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు వరకు ప్రపంచ క్రికెట్ హిస్టరీలో తనకంటూ ప్రత్యేకమైన పేజీలు లికించుకున్నాడు విరాట్ కోహ్లీ. ఇక ఎంతోమంది స్టార్ ప్లేయర్లకు సాధ్యం కానీ రికార్డులు సృష్టించి ఎవరికీ అందనంత ఎత్తులో కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి. ఫార్మాట్ తో సంబంధం లేకుండా తన బ్యాట్ తో విధ్వంసం కొనసాగిస్తూ ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరినీ కూడా ఎప్పుడు ఆశ్చర్యపరుస్తూనే ఉంటాడు విరాట్ కోహ్లీ.

 ఇక విరాట్ కోహ్లీ క్రికెట్ ఆడుతున్నాడు అని తెలిస్తే ప్రపంచ క్రికెట్లో ప్రతి అభిమాని కూడా అతని ఆటను చూడడానికి స్టేడియం కు తరలి వెళ్తూ ఉంటాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే క్రికెట్లో ఇలా కోహ్లీ ఎంత క్రేజీ సంపాదించుకున్నాడో సోషల్ మీడియాలో కూడా అదే రీతిలో పాపులారిటీ సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. నేటి జనరేషన్ క్రికెటర్లలో ఎవరికి సాధ్యం కాని రీతిలో ఫాలోవర్లు విరాట్ కోహ్లీ సంపాదించుకున్నాడు అని చెప్పాలి. ఇక కోహ్లీ ఏదైనా పోస్ట్ పెట్టాడంటే చాలు అది నిమిషాల వ్యవధిలో వైరల్ గా మారిపోతూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. ఇకపోతే ఇటీవల విరాట్ కోహ్లీ పెట్టిన ఇంస్టా స్టోరీ కాస్త వైరల్ గా మారింది.

 హాలీవుడ్ దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ తో పాటు హాలీవుడ్ యాక్టర్ టామ్ హాంక్స్ తమ ఫేమ్, లైఫ్ గురించి చెప్పిన ఆసక్తికర విషయాలు ఇక విరాట్ కోహ్లీ పోస్టులో ఉన్నాయి అని చెప్పాలి. ఫ్రేమ్ ను కాపాడాలను కోవడం ఏదైనా వ్యాధి వంటిదే. ఏదో ఒక రోజు ఈ వ్యాధి నుంచి బయటపడతా.. ఇక దీని నుంచి నేను విముక్తి పొందాలనుకుంటున్న.. పేరు ప్రఖ్యాతలపై నాకస్సలు పట్టింపు లేదు. సాధారణ జీవితం గడిపితే చాలు అని ఇర్ఫాన్ ఖాన్ రాసిన ఒక కోట్ తో పాటు.. మీరు కోపంగా ఉన్నారా లేదా మీ మనోస్థితి బాగాలేదా.. ఇక ఈ దశకు కూడా గడిచిపోతుంది.. మీరు ఎప్పుడు గ్రేట్గా ఫీల్ అవ్వాలి.. మీకు  అన్నింటికి జవాబులు తెలుసు అంటూ ఇక మరో పోస్ట్ కూడా పెట్టగా.. ఇది దేనికోసం కోహ్లీ పెట్టాడు అన్నది హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: