అతనితో పోలిస్తే.. సూర్యకుమార్ కు అంత సీన్ లేదు?

praveen
గత కొంతకాలం నుంచి భారత క్రికెట్లో హాట్ టాపిక్ గా మారిపోయిన ఆటగాడు ఎవరు అంటే అది ఎవరో కాదు సూర్య కుమార్ యాదవ్ అని ప్రతి ఒక క్రికెట్ ప్రేక్షకుడు చెబుతూ ఉంటాడు అని చెప్పాలి. ఎందుకంటే టీమిండియాలో తక్కువ సమయంలోనే తన బ్యాటింగ్ తీరుతో ఎక్కువ గుర్తింపు సంపాదించుకున్నాడు. అంతేకాదు ఇక ఎంతో మంది యువ ఆటగాళ్లు పోటీ ఉన్న సమయంలో కూడా టీమిండియా తరఫున నాలుగవ స్థానంలో నమ్మదగిన బ్యాట్స్మెన్ గా కూడా మారిపోయాడు సూర్య కుమార్ యాదవ్ అని చెప్పాలి. అయితే భారత జట్టులో ఉన్న మిగతా బ్యాట్స్మెన్లు పరుగులు చేయడానికి కష్టపడుతున్న పిచ్ లపై సైతం సూర్యకుమార్ యాదవ్ 360 డిగ్రీస్ అటు తీరుతో ఆశ్చర్యపరిచిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.

 ఇక ఇలా తన అద్భుతమైన ఆటతీరుతో ఏకంగా ప్రపంచ నెంబర్ వన్ బ్యాట్స్మెన్ గా కూడా మారిపోయాడు అని చెప్పాలి. కేవలం అదృష్టం కొద్ది  నెంబర్ వన్ ర్యాంక్ దక్కించుకున్నాడని విమర్శలు చేసిన వారికి తన ర్యాంకును పదిలం చేసుకుంటూ నోళ్లు మూయిస్తూ ఉన్నాడు.. అయితే ఇక ఇప్పుడు ప్రపంచ క్రికెట్లో సూర్యకుమార్ యాదవ్ నయ 360 డిగ్రీస్ ప్లేయర్గా మారిపోయాడు అని చెప్పాలి. గతంలో ఏపీ డివిలియర్స్ ఇలాంటి బిరుదును అందుకున్నాడు.

 అయితే ఏబీ డీవిలియర్స్ సూర్య కుమార్ యాదవ్ లలో ఎవరు బెస్ట్ అనే ప్రశ్న అప్పుడప్పుడు తిరమీదికి వస్తూ ఉంటుంది. ఇక ఇటీవల ఇదే విషయంపై మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు.  డివిలియర్స్ తో సూర్య కుమార్ యాదవ్ పోల్చి చూడటం తొందర పాటు అవుతుంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఎందుకంటే సూర్యకుమార్ కంటే ఎబి డివిలియర్స్ చాలా పవర్ఫుల్. లాంగ్ ఆఫ్ మీదుగా కవర్స్ ప్లేసులో కూడా ఎంతో నిలకడగా భారీషాట్లు కొట్టడం అంటే అది ఏబీ డీవిలియర్స్ కు మాత్రమే సాధ్యమవుతుంది. అయితే ప్రస్తుత క్రికెటర్లలో మాత్రం బట్లర్ కంటే సూర్యకుమార్ భారీ హిట్టింగ్ చేయగలడు అంటూ ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: