పూణే టీ 20: ఇండియా పేసర్లు మరో విజయాన్ని అందిస్తారా ?

VAMSI
ప్రస్తుతం ఆసియా కప్ ఛాంపియన్ అయిన శ్రీలంక ఇండియా పర్యటనలో ఉంది. అందులో భాగంగా మూడు టీ 20 లు మరియు మూడు వన్ డే లను ఆడాల్సి ఉంది. మొదట టీ 20 లో ఇండియా రెండు పరుగుల తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. వాస్తవంగా ఈ మ్యాచ్ లో శ్రీలంకనే ఫేవరెట్ గా అనిపించింది. కానీ ఆఖరి ఓవర్ లో శ్రీలంక ఆటగాడు చామీక కరుణరత్నే చేసిన ఒక తప్పిదం కారణంగా ఓటమై పాలయ్యారు. లాస్ట్ ఓవర్ లో వైడ్ బాల్ అని చూడడం అతను చేసిన పొరపాటుగా భావించాలి. అక్షర్ పటేల్ బౌలింగ్ లో మరో షాట్ ఆడి ఉంటే ఇండియాకు చెమటలు పట్టేవి. కానీ అనూహ్య రీతిలో ఆఖర్లో రెండు బంతులను వదిలేయడం చాలా విమర్శలకు దారితీసింది.
ఆ విధంగా టీం ఇండియా మొదటి మ్యాచ్ లో గెలిచి సిరీస్ లో ముందంజ వేసింది. ఇంకాసేపట్లో ఇండియా మరియు శ్రీలంక జట్ల మధ్యన రెండవ టీ 20 మ్యాచ్ పూణే వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ లో కనుక ఇండియా గెలిస్తే సిరీస్ ను దక్కించుకుంటుంది, లేదా శ్రీలంక గెలిస్తే సిరీస్ డిసైడర్ మ్యాచ్ వరకు వేచి చూడాల్సిందే. అయితే మొన్న మ్యాచ్ లో ఇండియా ఆటగాళ్లు బ్యాటింగ్ విభాగంలో సమిష్టిగా విఫలం అయ్యారు. ఓపెనర్ గా వచ్చిన గిల్ ఫెయిల్ కాగా, వన్ డౌన్ లో వచ్చిన సూర్య , శాంసన్, హార్దిక్ లు కూడా ఆశించిన మేరకు ఆకట్టుకోలేకపోయారు. ఆఖర్లో దీపక్ హూడా మరియు అక్షర్ పటేల్ లు నిలబడి ఆడకుంటే ఖచ్చితంగా శ్రీలంక సునాయాసంగా గెలిచేది.
ఈ రోజు మ్యాచ్ లో అయినా సూర్యకుమార్ యాదవ్ , గిల్ నుండి మెరుపులు వస్తే ఇండియాకు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక బౌలింగ్ లో ఏ మాత్రం మైనస్ లు లేవు.. కొత్త కుర్రాళ్ళు శివమ్ మావి మరియు ఉమ్రాన్ మాలిక్ లు అద్బుతమయిన పేస్ అండ్ లెంగ్త్ తో శ్రీలంకను ముప్పతిప్పలు పెట్టారు. మావి అయితే ఏకంగా అరంగేట్రం మ్యాచ్ లోనే నాలుగు వికెట్లు తీసుకుని ఘనంగా తన ఇంటర్నేషనల్ కెరీర్ ను స్టార్ట్ చేశాడు. మరి అదే ఫామ్ ను కొనసాగిస్తాడా లేదా అన్నది తెలియాలంటే మరికొన్ని మ్యాచ్ లు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: