నువ్విప్పుడు వైస్ కెప్టెన్.. అది మర్చిపోకు?

praveen
సూర్య కుమార్ యాదవ్..  ఈ ఆటగాడు గురించి ఈ ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులకు  కొత్తగా పరిచయం అక్కర్లేదు అని చెప్పాలి. ఎందుకంటే భారత చెట్టు తరపున  ఆడుతూ తక్కువ సమయంలోనే ఊహించని రీతిలో పాపులారిటీ సంపాదించాడు సూర్య కుమార్ యాదవ్. అంతేకాకుండా తన అద్భుతమైన బ్యాటింగ్ తో  ప్రేక్షకులను మంత్రముగ్ధులని చేశాడు అని చెప్పాలి. తన ముందు ఉంది ఎంత ప్రమాదకరమైన బౌలర్ అయినా సరే సూర్య కుమార్ యాదవ్లో మాత్రం భయం బెరుకు అనేది ఎక్కడ కనిపించదు అని చెప్పాలి.

 మైదానం నలువైపులా ఎంతో దూకుడుగా షాట్లు ఆడుతూ బౌలర్లను ముప్పు తిప్పలు పెడుతూ ఉంటాడు అని చెప్పాలి. ఏకంగా టి20 వరల్డ్ కప్ లో కూడా విరాట్ కోహ్లీ తర్వాత ఇక టీం ఇండియా విజయంలో కీలకపాత్ర వహించి టాప్ స్కోరర్గా నిలిచింది సూర్య కుమార్ యాదవ్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే అలాంటి సూర్య కుమార్ యాదవ్ ఇక దూకుడైన ఆట తీరుతోనే చివరికి కొన్ని కొన్ని సార్లు నిరాశ పరుస్తున్నాడు అన్నది తెలుస్తుంది. ఇటీవల జరిగిన శ్రీలంకతో మొదటి టి20 మ్యాచ్ లో భాగంగా మరోసారి నిరాశపరిచాడు సూర్య కుమార్ యాదవ్.

 అయితే గతంలో న్యూజిలాండ్తో జరిగిన వన్డే మ్యాచ్లో 30వ ఓవర్లో న్యూజిలాండ్ కెప్టెన్ స్లీప్ లో ఒక ఫీల్డర్ ను పెట్టి సూర్య కుమార్ వికెట్ సాధించాడు  దీంతో సూర్యకుమార్కి స్లిప్ లో ఫీల్డర్ ను పెడితే సరిపోతుంది అన్న టాక్ కూడా గతంలో వినిపించింది. అయితే శ్రీలంకతో మ్యాచ్లో వన్ డౌన్ లో బ్యాటింగ్ కి వచ్చాడు సూర్యకుమార్. ఆ స్థానంలో వచ్చినప్పుడు ముందుగా క్రీజులో కుదురుకొని ఆ తర్వాత మంచి ఇన్నింగ్స్ నిర్మించాల్సి ఉంటుంది. కానీ సూర్య కుమార్ మాత్రం తనదైన దూకుడు ప్రదర్శిస్తూ వికెట్ కోల్పోయాడు. అయితే ప్రస్తుతం సూర్య కుమార్ యాదవ్ వైస్ కెప్టెన్ గా ప్రమోట్ అయ్యాడు. ఇక ఇప్పుడు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కాస్త జాగ్రత్తగా ఆడితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారో అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: