వైరల్ : ఎంపైర్ ను బూతులు తిట్టిన యువ క్రికెటర్?

praveen
సాధారణంగా క్రికెట్ మ్యాచ్ ఎంత ఉత్కంఠ భరితంగా జరుగుతున్న సమయంలో ఆటగాళ్లు ఎలాగైనా తమ జట్టును గెలిపించాలి అనే ఉద్దేశంతో కొన్ని కొన్ని సార్లు ప్రత్యర్థి ఆటగాళ్ళతో కవ్వింపులకు దిగడం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇలా స్లెడ్జింగ్ చేసి ఏకంగా ప్రత్యర్థి ఆటగాళ్ల ఏకాగ్రతను దెబ్బతీసి వికెట్ సంపాదించాలని ఆశ పడుతూ ఉంటారు. అయితే ఇలా ప్రత్యర్థి  ఆటగాళ్లతో ఎన్ని సార్లు వివాదాలు పెట్టుకున్నప్పటికీ అటు ఎంపైర్ల జోలికి మాత్రం అస్సలు పోరు అని చెప్పాలి. ఎందుకంటే అమ్మాయిలతో కాస్త దురుసుగా ప్రవర్తిస్తే చివరికి నిబంధనలు ఉల్లంఘించినట్లు అవుతుంది. అందుకుగాను ఐసీసీ జరిమానా కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అని చెప్పాలి.

 అయితే కొంతమంది ఆటగాళ్లు మాత్రం మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరుగుతున్న సమయంలో అగ్రసీవ్ నెస్ తో కంట్రోల్ కోల్పోయి ఏకంగా ఎంపైర్లను కూడా తిట్టడం లాంటివి చేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఇలాంటివి ఏదైనా జరిగింది అంటే చాలు అది కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల భారత యువ ఆటగాడు దీపక్ హుడా సైతం ఏకంగా ఎంపైర్ ను బూతులు తిట్టడానికి సంబంధించిన వీడియో కాస్త ట్విటర్ వేదిక వైరల్ గా మారిపోయింది.

 ఇంతకీ ఏం జరిగిందంటే.. దీపక్ హుడా అక్షర్ పటేల్తో కలిసి ఎంతో అద్భుతమైన ఇన్నింగ్స్ నిర్మిస్తున్నాడు. మ్యాచ్ ఎంతో ఉత్కంఠ భరితంగా జరుగుతుండగా 18 ఓవర్లో కాసున్ రజిత ఐదో బంతిని అవుట్ సైడ్ దిశగా వేయగా తొలుత షాట్ ఆడాలనుకున్న దీపక్ హుడా దానిని వదిలేశాడు. ఇక ఈ బంతిని ఎంపైర్ వైడ్ గా ప్రకటిస్తాడు అని భావించాడు. కానీ అలా జరగలేదు అప్పటికే 5 వికెట్లు నష్టానికి 133 పరుగుల వద్ద ఉంది టీమిండియా దీంతో ఒత్తిడిలో ఉన్న దీపక్ హుడా ఎంపైర్ ను   ఉద్దేశించి అసభ్య పదజాలం వాడాడు. అంపైర్తో వాదనకు దిగాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారగా.. ఇది చూసిన ఎంతోమంది నేటిజన్స్ ఇంట్లో అమ్మానాన్న ఇదే నేర్పించారా అంటూ గట్టిగానే ఏకీపారేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: