NZ vs PAK: బాబర్ టైం అస్సలు బాలేదు... అంత ఈజీగా అవుట్ అయిపోయాడేమిటి పాపం?

praveen
కరాచీలో జరగుతోన్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో పాకిస్తాన్ కెప్టెన్ అయినటువంటి బాబర్ ఆజం చాలా ఫన్నీగా అవుట్ కావడం అభిమానులకు మింగుడు పడటం లేదు. అతడు చేయని తప్పుకి బలి కావడం ఓ రకంగా దురదృష్టకరమనే చెప్పుకోవాలి. పాక్ ఓపెనర్ అయినటువంటి ఇమామ్ ఉల్ హక్ ఇచ్చిన తప్పుడు కాల్ వలన బాబర్ మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది. ఇక్కడ వైరల్ అవుతున్న వీడియోని గమనిస్తే ఆ ఫన్నీ మిస్టేక్ మీకు చాలా స్పష్టంగా కనబడుతుంది.
మొదటి ఇన్నింగ్స్ పరంగా బాబర్ కేవలం 24 పరుగులు మాత్రమే చేయడం జరిగింది. పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్ లో 25వ ఓవర్ వేసిన మైఖేల్ బ్రేస్వెల్ బౌలింగ్ లో ఇమామ్ ఉల్ హక్ మిడ్ వికెట్ దిశగా ఆడటం జరిగింది. ఈ క్రమంలో ఇమామ్, బాబర్ 2 పరుగులు విజయవంతంగా పూర్తి చేసుకుని 3వ పరుగు కోసం ట్రై చేసారు. అయితే ఇమామ్ 3వ పరుగు తీసేందుకు ముందుకు వచ్చి మళ్లీ ఒక్కసారిగా వెనక్కి వెళ్లి పోయాడు. అది గమనించని బాబర్ ఇమామ్ పిలుపు ఇవ్వడంతో స్ట్రైకర్ వైపు పరిగెత్తుకుంటూ వెళ్లిపోయాడు.
ఇంకేముంది ఈ గేమ్ లో ఇద్దరు బ్యాటర్లు ఒక వైపే ఉండిపోవడం జరిగింది. దీంతో కివీస్ ఫీల్డర్ హెన్రీ నికోల్స్ బౌలర్ ఎండ్ వైపు త్రో చేశాడు. దాంతో చాలా తేలికగా బాబర్ రనౌట్ అయిపోవడం జరిగింది. దీంతో తీవ్ర నిరాశతో బాబర్ మైదానాన్ని వీడివెళ్లడం ఇక్కడ వీడియోలో మనం చూడవచ్చు. కాగా దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపొతే 2వ రోజు ఆటముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్ లో పాకిస్తాన్ 3 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేయగా క్రీజులో ఇమామ్ ఉల్ హక్(74), షకీల్ (13) పరుగులతో కొనసాగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: