రాహుల్ ద్రవిడ్ తర్వాత.. భారత కోచ్గా రాబోతుంది అతనేనా?

praveen
2021 టి20 ప్రపంచ కప్ ముగిసిన తర్వాత ఇక రవి శాస్త్రికి కోచ్గా పదవీకాలం ముగిసిపోయిన నేపథ్యంలో ఇక కొత్త కోచ్ గా పదవి బాధ్యతలు చేపట్టాడు రాహుల్ ద్రావిడు. అయితే అప్పటివరకు నేషనల్ క్రికెట్ అకాడమీ చైర్మన్గా కొనసాగాడు అన్న విషయం తెలిసిందే. అయితే అటు రాహుల్ ద్రావిడ్ కొత్తకోచ్ గా వచ్చాడో లేదో అప్పుడే విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం ఇక రోహిత్ శర్మ చేతికి కెప్టెన్సీ పగ్గాలు రావడం కూడా జరిగింది.

 తద్వారా ఇక టీమిండియాలో కొత్త శకం మొదలైంది అని చెప్పాలి. అయితే కోచ్ గా రాహుల్ ద్రావిడ్ పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత అటు టీమ్ ఇండియా జట్టు ద్వైపాక్షిక సిరీస్లలో అదరగొట్టింది. కానీ మెగాటోర్నీలు అయినా ఆసియా కప్ టి20 వరల్డ్ కప్ లో మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే మెగా టోర్నీలలో టీమిండియా ఓటమి ఏకంగా రాహుల్ ద్రావిడ్ కోచింగ్ పదవికే ఎసరు పెట్టేలా కనిపిస్తూ ఉంది. ఇక ఈ ఏడాదిలో కూడా ఆసియా కప్ వన్డే వరల్డ్ కప్ జరగబోతుంది. అప్పటి వరకు రాహుల్ ద్రావిడ్ కోచ్గా ఉండడం ఖాయంగా కనిపిస్తుంది.

 ఈ మెగా టోర్నీలలో టీమిండియా బాగా రానిస్తే పర్వాలేదు. కానీ ఒకవేళ పేలవ ప్రదర్శనతో నిరాశపరిస్తే మాత్రం ఇక రాహుల్ ద్రావిడ్ కోచ్ పదవికి ఎసరు పడినట్లే. ఒకవేళ రాహుల్ ద్రావిడ్ ను కోచ్ పదవి నుంచి తొలగిస్తే అతని స్థానంలో ఎవరు రాబోతున్నారు అన్న చర్చ మొదలైంది. అయితే ఇండియాలో వెరీ వెరీ స్పెషల్ అని పిలుచుకునే వివిఎస్ లక్ష్మణ్ ని ఇక రాహుల్ ద్రావిడ్ తర్వాత కోచ్గా పదవి బాధ్యతలు చేపట్టి అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ చైర్మన్గా ఉన్నాడు వివిఎస్ లక్ష్మణ్. రాహుల్ ద్రావిడ్ గైర్హాజరి ఉన్న సమయంలో లక్ష్మణ్ భారత కోచ్ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. దీంతో రాహుల్ ద్రావిడ్ తర్వాత భారత కోచ్గా అతనే రాబోతున్నాడు అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: