బౌలింగ్ వేగంలో.. అతని రికార్డు బద్దలు కొడతా : ఉమ్రాన్

praveen
ఐపీఎల్ లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించి తన మెరుపులాంటి బౌలింగ్ తో ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు ఉమ్రాన్ మాలిక్. ఏకంగా 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులు విసురుతూ టీమిండియా ఫ్యూచర్ అతనే అనే విధంగా అందరిలో నమ్మకాన్ని కలిగించాడు. ఈ క్రమంలోనే అందరితో పోల్చి చూస్తే తక్కువ సమయంలోనే టీమ్ ఇండియాలోకి వచ్చాడు. ఇక ఆ తర్వాత బంతిలో వేగం ఉన్నప్పటికీ వైవిధ్యం లేకపోవడంతో ఎక్కువ పరుగులు సమర్పించుకుని చివరికి టీమిండియాలో అడపాదడప అవకాశాలను మాత్రమే అందుకుంటున్నాడు.

 ఇటీవల కాలంలో అతను బౌలింగ్లో మరింత మెరుగయ్యాడు అన్న విషయం తెలిసిందే. వేగంగా బంతులను విసరడమే కాదు ఇక వైవిధ్యాన్ని కూడా చూపిస్తూ ఉన్నాడు. ఇకపోతే ఇప్పుడు నేటి నుంచి  శ్రీలంకతో జరగబోయే టి20 సిరీస్ లో భాగంగా ఉమ్రాన్ మాలిక్ కూడా అవకాశం దక్కించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవలే మీడియాతో మాట్లాడిన ఉమ్రాన్ మాలిక్ ఏకంగా పాకిస్తాన్ మాజీ ఆటగాడు అక్తర్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొడతాను అంటూ శపథం చేశాడు. నేను రికార్డుల గురించి ఆలోచించడం లేదు. నా మొదటి ప్రాధాన్యం జట్టు ప్రయోజనాల దేశం కోసం ఆడటమే ముఖ్యం. నిజానికి మ్యాచ్ జరుగుతున్న సమయంలో మనం ఎంత వేగంగా బంతిని విశారామో అన్న విషయం ఏ బౌలర్ కి తెలియదు.

 మ్యాచ్ ముగిసిన తర్వాతే ఎవరైనా ఈ విషయాలు తెలుసుకోగలుగుతారు. ఇక నా ధ్యాస ఎంత వేగంతో బంతిని విసురుతామన్న అంశం మీద కాకుండా సరైన ఏరియాలో బంతి పడుతుందా లేదా అనే విషయం పైనే ఉంటుంది అంటూ ఉమ్రాన్ మాలికి చెప్పుకొచ్చాడు. నా బౌలింగ్ బాగుంటే తప్పకుండా షోయబ్ అక్బర్ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొడతాను అంటూ తెలిపాడు. ఇంతకీ షోయబ్ అత్తర్ రికార్డు ఏమిటంటే.. 2003 ప్రపంచ కప్ టోర్నీలు ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్లో అతడు గంటకు 161.3 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ వేయగా ఇదే ఇప్పుడువరకు ప్రపంచ క్రికెట్లో అత్యధిక వేగవంతమైన బంతిగా కొనసాగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: