పంత్ కు యాక్సిడెంట్.. అతనికి లక్కీ ఛాన్స్?

praveen
ఇటీవల టీమ్ ఇండియాలో స్టార్ క్రికెటర్ గా కొనసాగుతున్న వికెట్ కీపర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదం పారిన పడ్డాడు. ఇక ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నాడు రిషబ్ పంత్. అయితే అతనికి తీవ్ర గాయాలు అయిన నేపథ్యంలో ఇక పలు సర్జరీలు కూడా అయినట్లు వైద్యులు తెలిపారు అని చెప్పాలి. ఇలా అనూహ్యంగా రోడ్డు ప్రమాదం బారిన పడిన రిషబ్ పంత్ అటు స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగబోయే టెస్ట్ సిరీస్ కు దూరం కాబోతున్నాడు అన్నది తెలుస్తుంది.

 ఎందుకంటే అతను గాయాల నుంచి కోలుకొని పూర్తి ఫిట్నెస్ సాధించడానికి దాదాపు 6 నెలల సమయం పడుతుందని అటు బీసీసీఐ వర్గాల నుంచి సమాచారం. ఈ లెక్కన చూస్తే ఇక స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్ కు దూరమైనట్లే. అయితే రిషబ్ పంత్ ప్రస్తుతం రోడ్డు ప్రమాదం కారణంగా దూరమైన నేపథ్యంలో ఇక తెలుగు క్రికెటర్ కోన శ్రీకర్ భరత్ కు ప్రస్తుతం టెస్టుల్లో భారత్ తరపున అరంగేట్రం చేయబోతున్నాడు అన్నది తెలుస్తుంది.

 ఆస్ట్రేలియా తో సిరీస్ కు ఇక భారత జట్టులోకి వచ్చేందుకు సిద్ధంగా ఉండాలని బీసీసీఐ నుంచి ఇప్పటికే కేఎస్ భరత్ కు పిలుపు వెళ్లిందట. గత కొంతకాలం నుంచి భారత జట్టుకు భరత్ ఎంపిక అవుతున్నప్పటికీ కేవలం బ్యాకప్ వికెట్ కీపర్ గా మాత్రమే ఉండిపోతున్నాడు. 2021 లో న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్లో భారత్కు తొలిసారిగా భారత జట్టులో అవకాశం దక్కింది. కానీ తుది జట్టులోకి మాత్రం రాలేకపోయాడు. ఇటీవల బంగ్లాదేశ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో కూడా జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ కేవలం బెంచ్ స్ట్రెంత్ కు మాత్రమే పరిమితం అయ్యాడు. ఇక ఇప్పుడు పంతుకు యాక్సిడెంట్ అయిన నేపథ్యంలో తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: