రెమ్యూనరేషన్ విషయంలో శ్రీలీల సంచలన నిర్ణయం.. అందుకోసమేనా..?

Divya
టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకొని ఎంతో మంది స్టార్ హీరోలకు జోడిగా నటించింది హీరోయిన్ శ్రీ లీల. ఈ ముద్దుగుమ్మ తన అందం డాన్స్ తో ఎంతోమందిని ఆకట్టుకుంది. సినిమాలు హిట్, ఫ్లాప్ సంబంధం లేకుండా వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం శ్రీలీల సరైన సక్సెస్ అనేది లభించలేదు. దీంతో శ్రీలీల కెరియర్ అయోమయంలో పడిందని చెప్పవచ్చు అంతేకాకుండా ఈ ఫెయిల్యూర్ ఎఫెక్ట్ వల్ల తన రెమ్యూనరేషన్ కూడా తగ్గించుకుందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.

శ్రీలీల ఇటీవల తమిళంలో నటించిన పరాశక్తి సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వం వహించగా భారీ బడ్జెట్ తో జనవరి 10వ తేదీన ఈ సినిమా విడుదల అయింది. అయితే  ఈ సినిమాలో నటించేందుకు శ్రీలీల రెమ్యూనరేషన్ ఇప్పుడు కోలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది. గతంలో టాలీవుడ్ హీరోలకు జోడిగా నటించిన శ్రీలీల రూ.3 నుంచి రూ.4కోట్ల రూపాయల వరకు వసూలు చేసేది. కానీ ఇప్పుడు పరాశక్తి సినిమాకు కేవలం కోటి రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.



తెలుగులో ఎన్నో చిత్రాలకు భారీగానే రెమ్యూనరేషన్ తీసుకున్న శ్రీలీల ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ కోసమే ఇలా రెమ్యూనరేషన్ తగ్గించుకున్నట్లు నిపుణులు సైతం తెలియజేస్తున్నారు. మరి కొంతమంది వరుస ప్లాపుల వల్ల కోలీవుడ్ లో కూడా తన మార్కెట్ ని నిలుపుకోవడం కోసమే శ్రీలీల ఇలాంటి నిర్ణయం తీసుకుందేమో అన్నట్టుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పుష్ప 2 చిత్రంలో వేసిన స్పెషల్ సాంగ్ తో దేశవ్యాప్తంగా భారీ పాపులారిటీ సంపాదించుకుంది. బాలీవుడ్ లో కూడా కార్తీక్ ఆర్యన్ సరసన ఒక సినిమాలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. మరి ఈ సినిమా బాలీవుడ్లో ఈమె కెరియర్ కు ఏ విధంగా ప్లస్ అవుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: